'మా' డైరీ విడుదల కార్యక్రమం రసాభాసగా సాగింది. రాజశేఖర్ ప్రవర్తన పట్ల తీవ్ర అసహనానికి గురైన చిరంజీవి, కృష్ణంరాజు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ తరువాత మోహన్ బాబు మైక్ తీసుకొని రాజశేఖర్ ప్రవర్తనని తప్పుబట్టారు.

సినీ పరిశ్రమలో ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా చేసే సుబ్బిరామిరెడ్డి లాంటి పెద్దల ముందు ఇలా గొడవ పడడంతో బాధాకరమని అన్నారు. ఆ తరువాత కార్యక్రమంలో నవ్వులు పూయించడానికి 'తాతగారైన కృష్ణంరాజుకి నమస్కారం' అని అనగానే అక్కడున్న వారంతా నవ్వేశారు.

చిరు వెర్సస్ రాజశేఖర్ : గొడవల చరిత్ర ఇదీ!

తను తిరుపతిలో బిఏ చదువుతున్నప్పుడు కృష్ణంరాజు సినిమాలు చూశానని చెప్పారు. అనంతరం చిరంజీవికి తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. ఇద్దరం ఒకచోట కలిస్తే ఛలోక్తులు విసురుకుంటామని.. అది కూడా సరదాకే తప్ప తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. చిరంజీవి కుటుంబం నాది.. నా కుటుంబం అతనిది అన్నారు.

ఈ సమయంలో మోహన్ బాబు వద్దకి వచ్చిన చిరంజీవి అయన బుగ్గపై ప్రేమగా ముద్దాడారు. ఇంట్లో చిన్న చిన్న గొడవలు సహజం కానీ మేమిద్దరం మాత్రం ఎప్పటికీ ఒక్కటే అంటూ చిరు గురించి గొప్పగా మాట్లాడారు. ఇప్పుడు మోహాన్ బాబుని చిరు ప్రేమగా ఆలింగనం చేసుకొని ముద్దాడిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.