చిరంజీవి, మహేష్ తో మొదలైన రచ్చ..'మా' పరువు తీసిన సంఘటనలు!

First Published 2, Jan 2020, 6:19 PM

తెలుగు చలచిత్ర పరిశ్రమలోని నటీ నటులకు ప్రత్యేకమైన వేదిక అవసరమని అప్పట్లో సినీ పెద్దలైన అక్కినేని నాగేశ్వర రావు, సూపర్ స్టార్ కృష్ణ లాంటి వారంతా 'మా అసోసియేషన్'ని స్థాపించారు. 1993లో మా అసోసియేషన్ స్థాపించబడింది. ఈ 25 ఏళ్లలో ఎంతోమంది మా అసోసియేషన్ కు అధ్యక్షులుగా పనిచేశారు. కానీ ప్రస్తుతం మా అసోసియేషన్ లో విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. గత రెండు మూడేళ్లుగానే ఇలాంటి పరిస్థితి నెలకొంది. అంతకుముందు ఇలాంటి గొడవలు లేవు. ప్రస్తుతం మా అసోసియేషన్ లో నెలకొన్న విభేదాలని ఒక్కసారి పరిశీలిద్దాం.. 

శివాజీ రాజా అధ్యక్షుడిగా: ప్రస్తుతం మా అసోసియేషన్ కు నరేష్ అధ్యక్షుడిగా ఉన్నారు. అంతకు ముందు శివాజీ రాజా అధ్యక్షడిగా పనిచేశారు. శివాజీ రాజా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నరేష్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వీరిద్దరి మధ్య క్షణం కూడా పొసిగేది కాదు.

సొంత భవనం కోసం: మా అసోసియేషన్ సొంత భవన నిర్మాణం కోసం గత కొన్నేళ్లుగా నిధులు సేకరణ జరుగుతోంది. కానీ ఇంతవరకు ఒకమంచి బిల్డింగ్ నిర్మించేందుకు అవసరమయ్యే నిధుల సమీకరణ జరగలేదు.

చిరంజీవి ఈవెంట్ తో రచ్చ: శివాజీ రాజా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా అమెరికాలో ఓ ఈవెంట్ నిర్వహించారు. మా అసోసియేషన్ బిల్డింగ్ కోసమే ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్ లో అనేక వివాదాలు వెలుగులోకి వచ్చాయి. శివాజీ రాజా 'మా' నిధుల్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు చేసిన వారిలో నరేష్ కూడా ఉన్నారు.

మహేష్ బాబుతో ప్లాన్ : చిరంజీవి తరహాలోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా ఓ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ శివాజీ రాజా, నరేష్ మధ్య విభేదాలతో అసలు ఈ ఈవెంట్ జరగనేలేదు. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అర్థాంతరంగా ఈ కార్యక్రమాన్ని ఆపేశారు.

తారాస్థాయికి విభేదాలు: క్రమంగా శివాజీ రాజా, నరేష్ మధ్య విభేదాలు పెరుగుతూ వచ్చాయి. ఒక దశలో శివాజీ రాజా మా అసోసియేషన్ నిధుల్ని తన ఖాతాల్లోకి మళ్లించుకున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది దాదాపు 14 లక్షల రూపాయలు శివాజీ రాజా ఖాతాలోకి వెళ్లాయని నరేష్ ఆరోపించారు. ఈ వివాదంలోకి నరేష్ హీరో శ్రీకాంత్ ని కూడా లాగారు.

ఎన్నికల సమయంలో: గత ఏడాది మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో టాలీవుడ్ రెండు వర్గాలుగా చీలిపోయింది. శివాజీ రాజా ప్యానల్ లో రాజీవ్ కనకాల, శ్రీకాంత్, బెనర్జీ లాంటి నటులు ఉన్నారు. నరేష్ ప్యానల్ లో జీవిత, రాజశేఖర్ దంపతులు, శివబాలాజీ ఉన్నారు. ఎన్నికల సమయంలో వీరి మధ్య పరస్పర విమర్శలు చెలరేగాయి.

సొంత టీంలోనే కుంపటి: ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ విజయం సాధించింది. నరేష్ మా అధ్యక్షడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన సొంత ప్యానల్ లోనే కుంపటి మొదలయింది. నరేష్ కు.. జీవిత రాజశేఖర్ దంపతులు ఎదురుతిరుగుతున్నారు. జీవిత, రాజశేఖర్ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుండడం నరేష్ కు నచ్చడం లేదు.

ఎమెర్జెన్సీ మీటింగ్: ఇటీవల నరేష్ కు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా జీవిత, రాజశేఖర్ మా సభ్యులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఇది నరేష్ నచ్చలేదు. ఈ మీటింగ్ కు నరేష్ దూరంగా ఉన్నారు. అధ్యక్షుడినే పక్కన పెడుతున్నారు అంటూ నరేష్ విమర్శలు గుప్పించారు.

సినీ పెద్దల ముందే.. ఇదిలా ఉండగా గురువారం రోజు మా అసోసియేషన్ డైరీ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణంరాజు, టి సుబ్బిరామిరెడ్డి లాంటి పెద్దలు అతిథులుగా హాజరయ్యారు. వీరిముందే రాజశేఖర్ చిరంజీవితో వాగ్వాదానికి దిగడం హాట్ టాపిక్ గా మారింది.

అడ్డుకున్న రాజశేఖర్: మా అసోసియేషన్ లో గొడవలు ఉంటే చర్చించుకుని సద్దుకుపోవాలని చిరంజీవి సూచించగా రాజశేఖర్ విభేదించారు. పలుమార్లు చిరంజీవి ప్రసంగాన్ని రాజశేఖర్ అడ్డుకోవడం వివాదంగా మారింది.