హాలీవుడ్ లో మొదలైన మీటూ ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇండియాలో కూడా మీటూ ఉద్యమం బాలీవుడ్ ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్ స్టీన్ మీటూ ఉద్యమంతో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇతడిపై అనేక కేసులు కూడా నమోదయ్యాయి. 

ప్రస్తుతం ఆ కేసుల విచారణ కోర్టులో కొనసాగుతోంది. విచారణలో భాగంగా హార్వీ వీన్ స్టీన్ గురించి సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అవకాశాల పేరుతో వర్థమాన నటీమణులని లోబరుచుకోవడం, వారిపై లైంగిక దాడులకు పాల్పడడం లాంటి దుర్మార్గపు చర్యలకు వీన్ స్టీన్ పాల్పడ్డాడు. మీటూ ఉద్యమంలో భాగంగా పలువురు హీరోయిన్లు, నటీమణులు ఇతగాడి వక్ర బుద్దిని వెలుగులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. 

రానాతో క్రేజీ డైరెక్టర్ పవర్ ఫుల్ మూవీ.. RRR టైటిల్ ఫిక్స్?

ఇదిలా ఉండగా ప్రస్తుతం హ్యారీ వీన్ స్టీన్ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. హార్వీ వీన్ స్టీన్ ఎవరిపై లైంగిక దాడికి పాల్పడలేదని, పరస్పర అంగీకారంతోనే నటీమణులు శృంగారంలో పాల్గొన్నారని అతడి తరుపున న్యాయవాదులు వాదిస్తున్నారు. హార్వీ ఓ మృగం లాంటి వ్యక్తి అని భాదితుల పరుపును న్యాయవాదులు వాదిస్తున్నారు. 

పవన్ కళ్యాణ్ మాటలకు గూస్ బంప్స్.. తమన్ కామెంట్స్

నువ్వు నాకు శృంగారం బాకీ ఉన్నావ్ అని సిగ్గులేకుండా ఓ నటిని అడిగాడని ఆరోపించారు. ఆమెపై లైంగిక దాడి చేసే ముందు సామర్థ్యం కోసం ఇంజెక్షన్లు కూడా తీసుకున్నాడని ఆరోపిస్తున్నారు. హార్వీపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో అతడికి ఖఠినమైన శిక్షలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

52 ఏళ్ళ హీరోయిన్ ఐదో పెళ్లి.. ఆమె భర్త శృంగార లీలలు తెలుసా!