సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ రానా దగ్గుబాటి విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. బాహుబలి చిత్రంలో భల్లాల దేవుడిగా రానా నటనకు ప్రశంసలు దక్కాయి. కెరీర్ ఆరంభం నుంచి రానా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. 

లీడర్, ఘాజి, నేనే రాజు నేనే మంత్రి చిత్రాలు ఆ కోవకు చెందినవే. ఈ చిత్రాల్లో రానా నటనే హైలైట్ గా నిలిచింది. తన చిత్రాలని వివిధ భాషల్లో రిలీజ్ చేస్తూ రానా క్రమంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్నాడు. ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శత్వంలో విరాటపర్వం అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇదిలా ఉండగా ఈ ఏడాది రానా నుంచి ఆసక్తికరమైన చిత్రాలు రాబోతున్నాయి. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో పౌరాణిక చిత్రం 'హిరణ్యకశ్యప'కు కసరత్తు జరుగుతోంది. తాజాగా మరో చిత్రాన్ని రానా అంగీకరించినట్లు తెలుస్తోంది. తనకు 'నేనే రాజు నేనే మంత్రి' లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన తేజ దర్శత్వంలో రానా మరోసారి నటించబోతున్నాడట.

 స్టన్నింగ్ పిక్స్.. నడుము సొగసుతో మతిపోగొడుతున్న నభా నటేష్!

తేజ ఇప్పటికే రానా కోసం ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశాడట. ప్రస్తుతం స్టోరీకి తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి 'రాక్షస రాజ్యంలో రావణాసురుడు' అనే పవర్ ఫుల్ టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ వినగానే రాజమౌళి RRR చిత్రం గుర్తుకు వస్తోంది. రాజమౌళి  RRR చిత్రానికి రామ రావణ రాజ్యం అనే టైటిల్ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. 

అల్లు అర్జున్ 'బుట్టబొమ్మ' సాంగ్ కి మలయాళీ హీరోయిన్ ఫిదా!

తేజ అనుకుంటున్న ఈ టైటిల్ గమనిస్తుంటే నేనే రాజు నేనే మంత్రి తరహాలో రానా మరోసారి నెగిటివ్ షేడ్స్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తేజ చివరగా తెరకెక్కించిన సీత చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.