సెలెబ్రిటీల జీవితాల్లో ప్రేమ, పెళ్లి వ్యవాహారాలు మీడియాలో హైలైట్ అవుతుంటాయి. చాలా మంది సినిమా సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రేమించడం, డేటింగ్, విడిపోవడం లాంటి వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం. 

హాలీవుడ్ సీనియర్ హీరోయిన్ పమేలా అండర్సన్ గురించి పరిచయం అవసరం లేదు. ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. పమేలా అండర్సన్ 1991లో సినీ జీవితాన్ని ప్రారంభించింది. అంతకు ముందే మోడల్ గా రాణించింది. ప్లే బాయ్ మ్యాగజైన్ కు కూడా పమేలా ఫోజులు ఇవ్వడం విశేషం. 

తాజాగా పమేలా అండర్సన్ ఐదో పెళ్లి చేసుకుంది. హాలీవుడ్ ప్రముఖ నీరంతా జాన్ పీటర్స్ తో ఆమె వివాహం రీసెంట్ గా జరిగింది. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ గా మారింది. ఎందుకంటే వీరిద్దరి జీవితంలో అనేక విచిత్రాలతో పాటు వివాదాలు కూడా ఉన్నాయి. 

పమేలాకు ఇది ఐదవ వివాహం కాగా.. జాన్ పీటర్స్ కు ఆరవ వివాహం. హాలీవుడ్ లో హెయిర్ స్టైలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన జాన్ పీటర్స్ క్రమంగా అగ్ర నిర్మాతగా ఎదిగాడు. ఈ క్రమంలో జాన్ అనేక వివాదాలు ఎదుర్కొన్నాడు. ఇక పమేలా అండర్సన్ గత నాలుగు వివాహాలు సెలెబ్రిటీలతోనే కావడం విశేషం. 1995లో పమేలా అండర్సన్ టామీ లీని మొదటి వివాహం చేసుకుంది. ఆ తర్వాత కిడ్ రాక్ ని, రిక్ సోలమన్ ని వివాహం చేసుకుంది. 

ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. రిక్ సోలమన్, పమేలా వివాహం 2007లో జరిగింది. కొంత కాలానికే వీరిద్దరూ విడిపోయారు. తిరిగి వీరిద్దరూ 2014లో మరోమారు వివాహం చేసుకున్నారు. మళ్ళీ 2015లో విడిపోయారు. అప్పటి నుంచి సింగిల్ గా ఉంటున్న పమేలా అండర్సన్ 52ఏళ్ల వయసులో ఐదో వివాహం చేసుకుంది. 

మహేష్ తో స్పెషల్ సాంగ్.. ఇండస్ట్రీలో కొన్ని తప్పవు.. తమన్నా కామెంట్స్

ఇక జాన్ పీటర్స్ విషయానికి వస్తే.. పమేలతో జాన్ బంధం ఈనాటిది కాదు.. దాదాపు 35 ఏళ్ల క్రితమే వీరిద్దరూ సహజీవనం చేశారు. ఆ తర్వాత విడిపోయి వేరు వేరుగా పెళ్లిళ్లు చేసుకున్నారు. పమేలాకు ఇద్దరు కొడుకులు సంతానం. జాన్ కు ఇద్దరు కూతుళ్లు. పాత బంధం మళ్ళీ చిగురించడంతో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 

స్టార్ హీరోకి అదిరిపోయే కౌంటర్.. 'మహాభారతం' ఏమిటని ప్రశ్నించిన కంగన!

జాన్ పీటర్స్ రసికుడు అంటూ హాలీవుడ్ లో ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఇతగాడు హాలీవుడ్ నటి కేథరిన్ జీటాతో శృంగారం జరిపినట్లు బయటకు వచ్చిన దృశ్యాలు తీవ్ర వివాదం అయ్యాయి. ప్రస్తుతం జాన్ వయసు 74 ఏళ్ళు. జాన్, పమేలా వివాహానికి వారి పిల్లలు కూడా హాజరయ్యారు. 

షాకింగ్: స్టార్ హీరో రెమ్యునరేషన్ రూ.120 కోట్లు.. సూపర్ స్టార్లు ఎందరుంటే ఏంటి!

వివాహం జరిగిన అనంతరం.. హాలీవుడ్ మీడియాతో జాన్, పమేలా మాట్లాడారు. తాను పమేలా కోసం 35 ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని.. ఇప్పటికి తన కోరిక నెరవేరిందని పీటర్స్ అన్నాడు. జాన్ ని ఎవరితోనూ పోల్చలేం.. అతడిని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నా.. మేమిద్దరం కెరీర్ ఆరంభం నుంచి ఒకే ఫ్యామిలీలా ఉన్నాం అని పమేలా తెలిపింది.