సంగీత దర్శకుడు తమన్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. తమన్ సంగీతానికి అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. రీసెంట్ గా తమన్.. అల వైకుంఠపురములో సంగీత విధ్వంసమే సృష్టించాడు. తమన్ కంపోజ్ చేసిన ఈ చిత్ర పాటలు ప్రేక్షకులని అలరించడమే కాకుండా యూట్యూబ్ లో వందల మిలియన్ల వ్యూస్ సాధిస్తున్నాయి. 

ఇదే ఉత్సాహంతో తమన్ భవిష్యత్తులో మరిన్ని చిత్రాలకు రెడీ అవుతున్నాడు. తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తన కెరీర్ ఆరంభంలో రవితేజ కిక్, ఎన్టీఆర్ బృందావనం చిత్రాలు మంచి బ్రేక్ ఇచ్చాయని తమన్ తెలిపాడు. 

ఆ తర్వాత ఎన్నో చిత్రాలకు తమన్ సంగీతం అందిస్తూ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో పరిచయం తర్వాత తన మైండ్ సెట్ పూర్తిగా మారిపోయిందని తమన్ తెలిపాడు. తాను ఎంతో అభిమానించే దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరని తమన్ తెలిపాడు. 

ఎన్ని చిత్రాలకు సంగీతం అందించినా పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయకపోవడం అనే లోటు అలాగే ఉండిపోయింది. త్వరలో ఆ లోటు కూడా తీరబోతోంది అని తమన్ తెలిపాడు. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం పింక్ రీమేక్ కు తమన్ సంగీత దర్శకుడు. పవన్ కళ్యాణ్ డైలాగ్స్ కు ఆర్ఆర్ అందించే రోజు కోసం ఎదురుచూస్తున్నా అని తమన్ తెలిపాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఆలోచించని రోజు లేదు. 

నితిన్ పెళ్ళికి అంతా సిద్ధం.. సినిమా ఇండస్ట్రీ మొత్తం..

పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించిన తర్వాత తొలి ప్రసంగాన్ని రిపీటెడ్ గా వింటుంటా. ఆయన మాటలు వింటుంటే గూస్ బంప్స్ వస్తాయి అని తమన్ తెలిపాడు. ఆల్రెడీ మణిశర్మతో కలసి ఖుషి, గుడుంబా శంకర్ చిత్రాలకు పనిచేశా అని తమన్ తెలిపాడు. 

రానాతో క్రేజీ డైరెక్టర్ పవర్ ఫుల్ మూవీ.. RRR టైటిల్ ఫిక్స్?