రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఇలా అప్పట్లో సౌత్ లో ఉన్న అగ్ర హీరోలందరి సరసన మీనా నటించింది. మీనా పేరిటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నమోదయ్యాయి. గ్లామర్ పరంగా కూడా మీనా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. 

సినిమాకు అవసరమైన మేరకు అందంగా కనిపించేది. కానీ ఎప్పుడూ హద్దులు దాటి గ్లామర్ ఒలకబోయలేదు. ప్రేక్షకులకు చికాకు పుట్టించే పాత్రలు కూడా మీనా ఎప్పుడూ చేయలేదు. వివాహం చేసుకుని స్థిరపడిన తర్వాత సినిమాల్లో జోరు తగ్గించింది. తాన్ వయసుకు సరిపడే పాత్రలు మాత్రమే చేస్తోంది. 

మీనా ప్రస్తుత వయసు 43 ఏళ్ళు. ఈ వయసులో మీనా బోల్డ్ పాత్రల వైపు టర్న్ తీసుకున్నట్లు అనిపిస్తోంది. చిత్ర పరిశ్రమలో డిజిటల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత వెబ్ సిరీస్ . ప్రేక్షకులని ఆకర్షించేందుకు బోల్డ్ కంటెంట్ తో వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. 

మీనా తన కెరీర్ లో తొలిసారి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. తమిళంలో రూపొందుతున్న ఆ వెబ్ సిరీస్ పేరు 'కరోలిన్ కామాక్షి'. రీసెంట్ గా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో మీనాని చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. 

ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం మీనా పాత్ర చాలా బోల్డ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గన్ పట్టుకుని యాక్షన్ సీన్స్ లో కూడా నటిస్తోంది. మద్యం సేవించే సన్నివేశాలులో కూడా మీనా కనిపిస్తోంది. ఆమె డ్రెస్సింగ్ కూడా డిఫెరెంట్ గా ఉంది. ఇక ట్రైలర్ చివర్లో మీనా మద్యం మత్తులో చెప్పే బూతు డైలాగులు అసభ్యకరంగా ఉన్నాయి. 

కొంతమంది అభిమానులు మీనా బోల్డ్ పెర్ఫామెన్స్ ని మెచ్చుకుంటున్నారు. మరికొందరు మాత్రం మీనా ఈ వయసులో ఇలాంటి పాత్రలు అవసరమా అంటూ నిరాశని వ్యక్తం చేస్తున్నారు. మీనా నోటి వెంట ఇలాంటి బూతు డైలాగులు వినలేం అని అంటున్నారు. మొత్తంగా ఈ వెబ్ సిరీస్ తో మీనా పెద్ద ప్రయోగమే చేస్తోంది.