తమిళ నటి సనమ్ శెట్టి వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సనమ్ శెట్టి, ఆమె ప్రియుడు తర్షన్ గురించి ప్రస్తుతం అంతా చర్చించుకుంటున్నారు. 35 ఏళ్ల సనమ్ శెట్టి, 28 ఏళ్ల తర్షన్ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. తర్షన్ తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నటుడిగా ఎదుగుతున్నాడు. 

సనమ్ శెట్టి హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ లో కూడా నటించింది. తెలుగులో సనమ్ శెట్టి మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రంలో నటించింది. శ్రీమంతుడు చిత్రంలో మహేష్ కి తెలియకుండా జగపతి బాబు పెళ్లి చూపులు అరేంజ్ చేస్తాడు. మహేష్ తో కలసి కాఫీ తాగే సన్నివేశంలో నటించింది సనమ్ శెట్టే. 

దిశా కేసు: చెన్నకేశవులు భార్యని కలసిన వర్మ.. ఎమోషనల్ కామెంట్స్!

ఇదిలా ఉండగా సనమ్ శెట్టి ప్రేమ వ్యవహారం ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. సనమ్ శెట్టి, తర్షన్ ల ప్రేమకు పెద్దలు కూడా అంగీకారం తెలపడంతో వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఇప్పుడు తనని పెళ్లి చేసుకోనని అంటున్నాడని తర్షన్ పై సనం శెట్టి కేసు నమోదు చేసింది. తర్షన్ ని బిగ్ బాస్ కు రికమండ్ చేసింది కూడా సనమ్ శెట్టే అని టాక్. 

ధనుష్ వల్లే అమలాపాల్ విడాకులు.. పెళ్లి తర్వాత జరిగింది ఇదే, సంచలన కామెంట్స్!

దీనితో తర్షన్ ప్రెస్ మీట్ పెట్టి మరి తన ప్రియురాలిపై విరుచుకుపడ్డాడు. సినిమాల్లో నటించాలని బైక్ అమ్మి చెన్నైకి వచ్చినట్లు తర్షన్ తెలిపాడు. మేమిద్దరం ప్రేమించుకున్న సంగతి వాస్తవమే. చిన్న చిన్న పత్రాలు చేస్తున్న సమయంలో సనమ్ శెట్టితో పరిచయం ఏర్పడింది. 2018లో మా మధ్య ప్రేమ మొదలైంది.

హీరోలకే మైండ్ బ్లాక్.. మాస్ స్టెప్పులతో టాప్ లేపేసిన హీరోయిన్లు 

అంతకు ముందే సనమ్ వేరొకరిని ప్రేమించి ఉంది. బిగ్ బాస్ లో కూడా పాల్గొన్నాం. మన ప్రేమని బయటకు చెప్పొద్దని, కెరీర్ కు ఇబ్బందులు వస్తాయని తెలిపింది. బిగ్ బాస్ షో తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. 

ఇతర మహిళా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని కలుసుకోకూడదని కండిషన్ పెట్టింది. ఎక్కడకు వెళ్లినా తనని కూడా తీసుకెళ్లాలని చెప్పింది. నాకు హీరోగా ఛాన్స్ వస్తే హీరోయిన్ ఆమెనే తీసుకోవాలని కూడా కండిషన్ పెట్టినట్లు తర్షన్ తెలిపాడు. 

కానీ నాకు మూడు అవకాశాలు వచ్చాయి. ఆమె నిర్మాతలతో చేతులు కలపి నా ఆఫర్స్ ని చెడగొట్టింది. ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరిస్తోంది. వీసా కోసం 3.5 లక్షలు ఇచ్చింది. ఆ డబ్బుని కూడా తిరిగి ఇచ్చేసా. నాకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటోంది. అలాంటి వ్యక్తిని నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో ఆమెని పెళ్లి చేసుకోను. కేసు పెట్టినా పర్వాలేదు.. చట్టపరంగా పోరాడుతా అంటూ తర్షన్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.