కొత్త బంగారు లోకం చిత్రంతో కుర్రకారుని మాయ చేసింది శ్వేతా బసు. క్యూట్ లుక్స్, టీనేజ్ గర్ల్ గా ఆమె నటన యువతని తెగ ఆకర్షించాయి. తెలుగులో శ్వేతా బసు పరిమిత సంఖ్యలో సినిమాలు చేసింది. ఆమె కెరీర్ లో చెప్పుకోదగ్గ విజయం అంటే కొత్త బంగారు లోకమే. కెరీర్ ని సరిగా ప్లాన్ చేసుకోకపోవడం వాళ్ళ శ్వేతా బసు పరాజయాలు ఎదుర్కొంది. 

ఆ తర్వాత ఓ కేసులో చిక్కుకుని కెరీర్ ని పూర్తిగా నాశనం చేసుకుంది. ప్రస్తుతం శ్వేతా బసు మళ్ళీ నటిగా రాణించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా శ్వేతా బసు కెరీర్ ని వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. 

2018లో శ్వేతా బసు రోహిత్ మిట్టల్ అనే వర్థమాన దర్శకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఏమైందో ఏమోకానీ ఏడాది తిరగక ముందే వీరిద్దరి వ్యక్తిగత జీవితంలో విభేదాలు ఎదురయ్యాయి. తామిద్దరం విడాకుల ద్వారా విడిపోతున్నట్లు గత ఏడాది సోషల్ మీడియాలో శ్వేతా బసు సంచలన ప్రకటన చేసింది. 

విడాకుల తర్వాత శ్వేతా బసు చాలా తక్కువగా మీడియా ముందుకు వస్తోంది. ఇటీవల  ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్వేతా బసు తన వ్యక్తిగత జీవితం గురించి మనసు విప్పి మాట్లాడింది. పరస్పర అంగీకారంతోనే రోహిత్ మిట్టల్, తాను విడిపోయాం అని శ్వేతా బసు అన్నారు. భార్య భర్తలుగానే మేం విడిపోయాం.. స్నేహితులుగా కాదు.. మా మధ్య స్నేహం కొనసాగుతుంది అని శ్వేతా తెలిపింది. 

‘పింక్‌’ రీమేక్‌.. ఆ విషయంలో పవన్ డిమాండ్

నేను ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రోహిత్ నాకు అండగా నిలిచాడు. వృత్తి పరంగా అతడికి నేను అభిమానిని. భవిషత్తులో రోహిత్ తో కలసి పనిచేస్తా. కొన్ని కారణాలవల్ల మాత్రమే మేం విడిపోయాం. భవిష్యత్తులో ప్రేమ జోలికి వెళ్లనని నేను చెప్పను. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ ఎదురవుతుంది అని శ్వేతా తెలిపింది. ఇప్పటికైతే ప్రేమ గురించి ఆలోచించడం లేదు. కెరీర్ పై ఫోకస్ చేస్తున్నట్లు శ్వేతా చెప్పుకొచ్చింది.