సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం కళ్ళు చెదిరే వసూళ్లతో దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ అధికారిగా నటించాడు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. 

అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా రష్మిక మందన నటించింది. మిల్కీ బ్యూటీ తమన్నా 'డాంగ్ డాంగ్' అనే స్పెషల్ సాంగ్ లో చిందేసింది. కెరీర్ లో అవకాశాలు తగ్గడం వల్లే తమన్నా స్పెషల్ సాంగ్స్ ఎంచుకుంటోంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

మళ్ళీ లవ్ ఎఫైర్.. విడాకుల తర్వాత శ్వేతా బసు!

ఈ విమర్శలపై తమన్నా తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. నాకు అవకాశాలు తగ్గలేదు. కానీ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో మాత్రమే నటిస్తున్నా. నిజంగా అవకాశాలు తగ్గితే ప్రాధాన్యత లేని చిత్రాల్లో నటించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే సినిమాలతో పాటు నాకు వ్యాపారాలు కూడా ఉన్నాయి అని తమన్నా తెలిపింది. 

ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను కాబట్టే సినిమాలు చేస్తున్నా. ప్రాధాన్యత ఉన్న చిత్రాలు మాత్రమే ఎంచుకుంటున్నా. అనిల్ రావిపూడి గారు నాకు ఎఫ్ 2 రూపంలో హిట్ ఇచ్చారు. ఆయన అడగగానే సరిలేరు నీకెవ్వరు చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఒప్పుకున్నా. ఇండస్ట్రీలో కొన్ని మొహమాటాలు తప్పవు అని తమన్నా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. 

తమన్నా ఇప్పటి వరకు అల్లుడు శీను, జైలవకుశ, స్పీడున్నోడు లాంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేసింది.