సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటించిన ఈ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. లేడి అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకని నేడు ఎల్బీస్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలిసారి మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు చిత్రం కోసం చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.   

ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా తన పెర్ఫామెన్స్ తో పిచ్చెక్కించింది. గ్లామర్ అవుట్ ఫిట్ లో మెరిసిన తమన్నా డాంగ్ డాంగ్ సాంగ్ కు డాన్స్ చేసింది. తమన్నా పెర్ఫామెన్స్ ప్రీరిలీజ్ వేడుకలో హైలైట్ గా నిలిచింది. అనంతరం దర్శకుడు కొరటాల శివ, వంశీ  ప్రసంగించారు. కొరటాల శివ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. చిరంజీవి గారి వల్లే తనకు సినిమాలంటే పిచ్చి ఏర్పడిందని అన్నారు. 

విజయశాంతి, చిరంజీవి కాంబోలో వచ్చిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి చిత్రాలని వంశీ పైడిపల్లి వేదికపై ప్రస్తావించారు. దీనితో అభిమానుల కేరింతలతో ఎల్బీ స్టేడియం మోతెక్కిపోయింది. మహేష్ కెరీర్ లో సరిలేరు నీకెవ్వరు చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని వంశీ పైడిపల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. 

అనంతరం రష్మిక మండన క్యూట్ స్పీచ్ తో ఆకట్టుకుంది. తన అదృష్టానికి కారణం చిరంజీవి గారే అంటూ రష్మిక ఓ సీక్రెట్ చెప్పింది. చిరంజీవి సర్ తాను నటించిన ఛలో, గీత గోవిందం చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు అతిథిగా హాజరయ్యారు. ఆ రెండు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ కు కూడా హాజరయ్యారు. అందుకే నా అదృష్టానికి మరో రూపం చిరంజీవి సర్ అని రష్మిక తెలిపింది. 

సరిలేరు ప్రీరిలీజ్: పరోక్షంగా పవన్ పేరు..ఎర్రి డాష్ అనిపించుకున్నా: బండ్ల గణేష్

సరిలేరు ప్రీరిలీజ్: మహేష్ ని బుక్ చేసేసుకున్నారు.. నిలదీసిన సుధీర్ బాబు!

సరిలేరు ప్రీరిలీజ్: చిరు, విజయశాంతి కాళ్ల దగ్గర కూర్చుండిపోయిన రష్మిక!