సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటించిన ఈ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. లేడి అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకని నేడు ఎల్బీస్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలిసారి మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు చిత్రం కోసం చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. 

ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్ బాబుతో దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తెరకెక్కించిన శ్రీను వైట్ల ప్రసంగించారు. ఆయన మెగా సూపర్ ఈవెంట్ కు అతిథిగా హాజరయ్యారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలసి ఒక ఈవెంట్ కు హాజరు కావడం ప్రతి ఒక్కరూ సంతోషించే విషయం అని శ్రీను వైట్ల అన్నారు. 

ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర నాకు బాగా కావలసిన మనిషి. సరిలేరు నీకెవ్వరు మూవీ మంచి విజయం సాధించాలి. గత దశాబ్దం ఆరంభంలో మహేష్ బాబు దూకుడు చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. అలాగే ఈ దశాబ్దం ఆరంభంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంతో శుభారంభం చేయాలి అని శ్రీను వైట్ల కోరారు. 

శ్రీను వైట్ల ప్రసంగించే సమయంలో హీరోయిన్ రష్మిక మందన బ్యూటిఫుల్ ఎంట్రీ ఇచ్చింది. రష్మిక వచ్చే సమయానికే చిరంజీవి, మహేష్, విజయశాంతి ఈవెంట్ కు హాజరై ఉన్నారు. రష్మిక రాగానే అతిథులందరిని పలకరిస్తూ మెగాస్టార్ చిరంజీవి దగ్గరు కూర్చుండి పోయింది. ఆప్యాయంగా చిరంజీవిని పలకరించింది. చిరంజీవి కూడా ఎంతో ఆప్యాయంగా రష్మికని పలకరించారు. అలాగే విజయశాంతి వద్దకు వల్లే ఆమె దగ్గర కూడా అలాగే కూర్చుంది. ఈ దృశ్యాలు అభిమానులని కనువిందు చేశాయి. 

సరిలేరు ప్రీరిలీజ్: పరోక్షంగా పవన్ పేరు..ఎర్రి డాష్ అనిపించుకున్నా: బండ్ల గణేష్

సరిలేరు ప్రీరిలీజ్: మహేష్ ని బుక్ చేసేసుకున్నారు.. నిలదీసిన సుధీర్ బాబు!