సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటించిన ఈ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. లేడి అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకని నేడు ఎల్బీస్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలిసారి మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు చిత్రం కోసం చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు.   

ప్రీరిలీజ్ వేడుకలో మహేష్ బావ, హీరో సుధీర్ బాబు తన ప్రసంగంతో ఆకట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఆకాశంలో ఉన్న స్టార్స్ ని అరుంధతి అని, ధ్రువ నక్షత్రం అని పిలుస్తుంటారు. వాటికి ఆపేరు ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ మనకు కనిపించే నిజాయమైన స్టార్స్ సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు అని సుధీర్ బాబు తెలిపాడు. 

కష్టానికి నిలువెత్తు నిదర్శనం చిరంజీవి గారు ముఖ్య అతిథిగా హాజరు కానుండడం సంతోషం అని సుధీర్ బాబు తెలిపారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు కూడా రీ ఎంట్రీ ఇస్తున్నారు. దిల్ రాజుని ఉద్దేశించి మాట్లాడుతూ.. దిల్ రాజు గారు మహేష్ ని వరుసగా బుక్ చేసుకుంటున్నారు. మరో నిర్మాతకు అవకాశం ఇవ్వరా. ఇక్కడ కొత్త ప్రొడక్షన్ హౌస్ లు వస్తున్నాయి అని సుధీర్ బాబు దిల్ రాజుని సరదాగా నిలదీశారు. 

అనిల్ రావిపూడి చిత్రాలు ఒత్తిడి తగ్గిస్తాయి. టెన్షన్ లో ఉన్నప్పుడు అనిల్ రావిపూడి చిత్రాలు చూస్తే చాలు.. ఒత్తిడి మొత్తం తగ్గిపోతుంది అని సుధీర్ బాబు తెలిపారు. ఇక మహేష్ బాబు నవ్వినా, కోపగించుకున్నా అందులో ఫేక్ ఉండదు. అందుకే మనం మహేష్ కి బాగా కనెక్ట్ అయిపోయాం అని సుధీర్ తెలిపారు. 

సరిలేరు ప్రీరిలీజ్: పరోక్షంగా పవన్ పేరు..ఎర్రి డాష్ అనిపించుకున్నా: బండ్ల గణేష్

మహేష్, చిరంజీవి ఇద్దరితో అనిల్ రావిపూడి ఓ మల్టి స్టారర్ మూవీ చేయాలని సుధీర్ బాబు ఆకాంక్షించారు. సుధీర్ బాబు ప్రసంగిస్తుండగానే మహేష్ మెగా సూపర్ ఈవెంట్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.