సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు ఈ చిత్రంలో ఆర్మీ మేజర్ గా నటిస్తుండడం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

ఇటీవల విడుదలైన టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ చేస్తున్నారు. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని వేగవంతం చేస్తోంది. 

భార్యకు బంగారం కొనిచ్చే స్తోమత లేదా.. హీరో ఏం చేశాడంటే..

గీతా గోవిందం, ఛలో లాంటి చిత్రాలతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక.. మహేష్ తో తొలిసారి రొమాన్స్ చేయనుండడం ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. ప్రతి సోమవారం సరిలేరు నీకెవ్వరు టీం పాటలతో సందడి చేస్తోంది. డిసెంబర్ 16న ఈ చిత్రంలోని మూడవ సాంగ్ విడుదల కాబోతోంది.

వాళ్లిద్దరూ అయిపోయారు.. ఎన్టీఆర్ పై గురిపెట్టిన సీనియర్ హీరో! 

'He Is So Cute' అంటూ మహేష్ బాబు అందాన్ని పొగుడుతూ రష్మిక డాన్స్ చేసే సాంగ్ ఇది. తాజాగా ఈ సాంగ్ ప్రోమోని టిక్ టాక్ వీడియో రూపంలో చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట కోసం రష్మిక డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలని ఈ వీడియోలో చూపించారు. 

మెగా హీరో సిక్స్ ప్యాక్ లుక్ వైరల్.. కండలు తిరిగిన బాడీతో పోరాటం!

క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, అదిరిపోయే డాన్స్ మూమెంట్స్ తో రష్మిక ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చిత్ర యూనిట్ ట్విట్టర్ లో పోస్ట్ చేయగానే ఫ్యాన్స్ ట్రెండింగ్ మొదలు పెట్టేశారు. సాంగ్ ప్రోమో వింటుంటే దేవిశ్రీ ఈ పాటకు అదిరిపోయే ట్యూన్ అందించినట్లు అర్థం అవుతోంది. ఇక రష్మిక స్టెప్పులతో విజువల్ గా కూడా ఈ సాంగ్ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. 

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా ఎల్లా తర్వాత టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో విజయశాంతి ప్రొఫెసర్ భారతి పాత్రలో నటిస్తోంది.