బాలీవుడ్ హీరోలకు అప్పుడప్పుడూ కొన్ని సరదా ఆలోచనలు వస్తుంటాయి. తమ పార్ట్నర్స్ ని మెప్పించేందుకు బాలీవుడ్ హీరోలు కష్టపడుతుంటారు. భార్యలకు, గర్ల్ ఫ్రెండ్స్ కు అత్యంత ఖరీదైన గిఫ్ట్స్ ని బాలీవుడ్ హీరోలు అందించడం చూస్తూనే ఉన్నాం. కానీ ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. 

బంగారంతో పోల్చితే అంత్యత చౌకబారు గిఫ్ట్ ని తన భార్య ట్వింకిల్ ఖన్నాకు అందించాడు. కానీ ట్వింకిల్ ఖన్నా చిన్నతనంగా భావించలేదు.. థ్రిల్ ఫీల్ అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రస్తుతం అక్షయ్ కుమార్, కరీనా కపూర్ జంటగా నటించిన గుడ్ న్యూస్ చిత్రం డిసెంబర్ 27న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. 

ఇటీవల అక్షయ్ కుమార్ కపిల్ శర్మ షోలో పాల్గొన్నాడు. షో నుంచి ఇంటికి వచ్చాక తన సతీమణికి ఉల్లిపాయలతో చేసిన ఇయర్ రింగ్స్ ని బహుమతిగా ఇచ్చాడు. చూడచక్కగా ఉన్న ఉల్లిపాయల చెవిపోగులు చూసి ట్వింకిల్ ఖన్నా సంతోషం వ్యక్తం చేసింది. 

జిగేల్ రాణి అందాలు.. క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న బ్యూటీ!

వీటిని అక్షయ్ కుమార్ కరీనా కపూర్ కి గిఫ్ట్ గా ఇస్తాడని కపిల్ శర్మ షోలో అంతా భావించారు. కానీ ఆమె అంగీకరిస్తుందో లేదో తెలియదు. నేను మాత్రం తప్పకుండా తీసుకుంటానని అక్షయ్ నమ్మకం. కొన్ని సార్లు చిన్న బహుమతులు కూడా గొప్పగా అనిపిస్తాయి అని ట్వింకిల్ ఖన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

వాళ్లిద్దరూ అయిపోయారు.. ఎన్టీఆర్ పై గురిపెట్టిన సీనియర్ హీరో!

ఈ ఉల్లిపాయల ఇయర్ రింగ్స్ చూసి నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. భార్యకు బంగారం కొనిచ్చే స్తోమత కూడా అక్షయ్ కు లేదా అని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. ప్రస్తుతం ఉల్లిపాయలు ధరలు గమనిస్తే బంగారంతో ఏమాత్రం తీసిపోవు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.