విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం వెంకీమామ. నాగ చైతన్య, వెంకటేష్ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఇది. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. వెంకిమామ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండడం విశేషం. 

ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. ఇటీవల కాలంలో వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రాలకు బ్రాండ్ గా మారారు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, గోపాల గోపాల, ఎఫ్ 2 లాంటి మల్టీస్టారర్ మూవీస్ వెంకటేష్ నుంచి వచ్చాయి. 

మల్టీస్టారర్ చిత్రాలకు మీరు పెద్ద దిక్కుగా మారినట్లు ఉన్నారు అని మీడియా ప్రశ్నించగా వెంకటేష్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. అంతలేదు.. ఒకట్రెండు చిత్రాలు సరిగా ఆడకుంటే.. వీడికి ఎక్కువైంది.. మల్టీస్టారర్ చిత్రాలు ఎందుకు.. సోలో హీరోగా చేయక అని కూడా అంటారు.. అసంగతి కూడా నాకు తెలుసు అని వెంకటేష్ అన్నారు. 

మల్టీస్టారర్ చిత్రాలు చేస్తున్నప్పుడు మీ ప్పాత్ర నిడివి గురించి ఆలోచిస్తారా అని ప్రశ్నించగా.. అలా ఆలోచిస్తే మల్టీస్టారర్ చిత్రాలు చేయలేం అని సమాధానం ఇచ్చాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల లాంటి చిత్రాలు చేస్తున్నప్పుడు న పాత్ర ఏంటి.. నేను చేయాల్సింది ఏంటి అని మాత్రమే ఆలోచించాను అని వెంకీ చెప్పుకొచ్చాడు. 

వెంకటేష్ తన కెరీర్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి బడా హీరోలతో మల్టీస్టారర్ చిత్రాలు చేశారు. ఈ తరం హీరోల్లో ఎన్టీఆర్, నాని లాంటి హీరోలతో నటించాలని ఉందని వెంకీ తన కోరికని బయటపెట్టాడు. మరి వెంకీ కోరిక భవిష్యత్తులో నెరవేరుతుందో లేదో చూడాలి.