రష్మిక మందన్న.. ప్రస్తుతం ఈ పేరు సౌత్ చిత్ర పరిశ్రమలో మారుమోగిపోతోంది. క్యూట్ లుక్స్, అందంతో ఆకట్టుకుంటున్న రష్మికకు వరుస విజయాలు ఎదురవుతున్నాయి. దీనితో రోజు రోజుకు రష్మిక డిమాండ్ పెరుగుతోంది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక.. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకుంది. 

సినిమాల పరంగానే కాదు వ్యక్తిగత విషయాలతోను రష్మిక వార్తల్లో నిలుస్తోంది. ఆ మధ్యన కన్నడ హీరో రక్షిత్ తో రష్మిక పెళ్లివరకు వెళ్ళింది. కానీ మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. తాజాగా రష్మిక ఫ్యామిలీపై జరిగిన ఐటి దాడులు కర్ణాటకలో కలకలం సృష్టిస్తున్నాయి. 

ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు నేపథ్యంలో ఐటీ అధికారులు రష్మిక నివాసంపై కొన్ని రోజుల క్రితం దాడులు నిర్వహించారు. కర్ణాటకలోని కుడకు జిల్లాలోని కుక్కులూరు రష్మిక సొంత గ్రామం. ఆ గ్రామంలో రష్మిక ఇల్లు, కల్యాణ మంటపంపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాకపోతే ఈ వ్యవహారం పూర్తిగా రష్మిక తండ్రి మదన్ వైపు ఉంది. ఆయన కుడకు ప్రాంతంలో 50 ఎకరాల కాఫీ తోటని కొనేందుకు ప్రయత్నించారట. 

హీరోయిన్ రష్మిక ఇంటిపై ఐటి దాడులు: విస్తుపోయే కారణం

అంత డబ్బు ఎలా వచ్చిందనే అనుమానంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. లెక్కలు సరిగా లేని 25 లక్షల నగదు, ఇంటి పాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐటీ దాడుల నేపథ్యంలో తన పేరు మీడియాలో హైలైట్ అవుతుండడంతో రష్మిక నిరాశపడుతోంది. 

RRRలో ఆయన లేరట.. రాజమౌళి సినిమాలో ఈ ట్విస్టులేంటి!

రష్మిక ఎప్పటికప్పుడు ఆదాయపు పన్ను చెల్లిస్తుందని ఆమె మేనేజర్ అంటున్నారు. ఈ ఐటీ దాడులపై రష్మిక రియాక్షన్ మరోలా ఉంది. ఐటీ దాడులు జరగడంతో కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని రష్మిక తెలిపింది. రష్మిక నిర్మాతల వద్ద అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటోందని.. పెద్ద హీరోల చిత్రాలలో భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందని ప్రచారం చేస్తున్నారు. 

అబ్బబ్బ.. హీరోల పేర్లు చూశారా.. త్రివిక్రమ్ లా ఎవరికీ సాధ్యం కాదు!

అసలు తాను ఇంతవరకు స్టార్ హీరోల సినిమాల్లో నటించే స్థాయికి ఎదగలేదని రష్మిక అంటోంది. దీనిపై రాజకీయంగా కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రష్మిక తండ్రి మదన్ కర్ణాటకలో కాంగ్రెస్ నేత. కాబట్టే ఆయనపై ఐటి దాడులు జరుగుతున్నాయనే వాదన కూడా ఉంది. 

రూ. 25 లక్షల గుట్టు: హీరోయిన్ రష్మికకు ఐటి నోటీసులు జారీ