దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. యావత్ దేశం సినీ అభిమానులంతా ఈ భారీ చిత్రం కోసం చూస్తున్నారు. బాహుబలితో రాజమౌళి తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. అలాంటి రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న చిత్రం కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ రాజమౌళి మాత్రం ఎప్పటిలాగే సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్ మైంటైన్ చేస్తున్నాడు. నటీనటుల వివరాలు, కథ గురించి కొంత సమాచారం తప్పి మరే ఇతర విశేషాలు ఇప్పటివరకు బయటకు రాలేదు. 

మరోవైపు ఈ చిత్రం విషయంలో ప్రేక్షకుల్లో కొంత గందరగోళం కూడా ఉంది. ఈ చిత్రంలో కన్నడ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు ఇటీవల జోరుగా వార్తలు వచ్చాయి. బ్రిటిష్ కాలం నాటి పోలీస్ అధికారిగా సుదీప్ నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. 

అబ్బబ్బ.. హీరోల పేర్లు చూశారా.. త్రివిక్రమ్ లా ఎవరికీ సాధ్యం కాదు!

ఈ వార్తలపై తాజాగా సుదీప్ స్పందించాడు. తాను ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తం అని తేల్చేశాడు. ఈ మేరకు సుదీప్ ట్వీట్ చేస్తూ.. నేను ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించడం లేదు. ఈ చిత్రం కోసం ఇంతవరకు ఎవరూ నన్ను సంప్రదించలేదు అని సుదీప్ క్లారిటీ ఇచ్చాడు. 

'సిత్తరాల సిరపడు' పాటకి టీడీపీ ఎంపీ ఎమోషనల్.. అల్లు అర్జున్ కి థాంక్స్!

బ్రిటిష్ కాలం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. 400 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాత. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.