మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరూ టాలీవుడ్ లో అగ్ర నటులు. చిరంజీవి దశాబ్దాలుగా టాలీవుడ్ లో మెగాస్టార్ గా వెలుగొందుతున్నారు. ఇక మోహన్ బాబు విలన్ పాత్ర అయినా, హీరో పాత్ర అయినా విలక్షణ నటనతో తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకున్నారు. వీరి పిల్లలు కూడా ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నటీనటులుగా రాణిస్తున్నారు. 

కొన్ని చిన్న చిన్న వివాదాలు పక్కన పెడితే చిరంజీవి, మోహన్ బాబు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరూ ఎన్నో చిత్రాల్లో కలసి నటించారు. ఇదిలా ఉండగా జనవరి 2న పార్క్ హయత్ హోటల్ లో జరిగిన మా అసోసిషన్ డైరీ లాంచ్ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి, రాజశేఖర్ మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. 

మా లో ఉన్న వివాదాలని బయట మీడియా ముందు రచ్చ చేయకుండా చర్చించుకుని పరిష్కరించుకోవాలని చిరంజీవి సూచించారు. చిరంజీవి వ్యాఖ్యలతో రాజశేఖర్ విభేదించారు. మాలో కొన్ని విభేదాలు ఉన్నాయని అగ్రెసివ్ గా వేదికపై రాజశేఖర్ ప్రసంగించారు. దీనితో చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేయడం.. రాజశేఖర్ అక్కడి నుంచి అలిగి వెళ్లిపోవడంతో హాట్ టాపిక్ గా మారింది. అనంతరం రాజశేఖర్ మా వైస్ ప్రెసిడెంట్ పదవికి కూడా రాజీనామా చేశారు. 

జయసుధ 'కంట్రోల్ రాజశేఖర్' అని అంటున్నా.. చిరు, కృష్ణంరాజు అసహనం..!

ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు మోహన్ బాబు, మురళీమోహన్, టి.సుబ్బిరామిరెడ్డి, కృష్ణంరాజు అతిథులుగా హాజరయ్యారు. వేదికపై చిరంజీవి, మోహన్ బాబు మధ్య సాన్నిహిత్యం అందరిని ఆకర్షించింది. మోహన్ బాబుని చిరు ఆప్యాయంగా కౌగిలించుకోవడం, ఆయనకు ముద్దివ్వడం లాంటి దృశ్యాలు అభిమానులకు కనుల పండుగలా మారాయి. ప్రస్తుతం చిరంజీవి, మోహన్ బాబు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

కుక్కలమో, గేదెలమో కాదు.. ఆ హక్కు మీకు లేదంటూ జీవిత ఫైర్!

చిరు మోహన్ బాబుకు ముద్దిస్తున్న ఫోటోపై మంచు మనోజ్ తనదైన శైలిలో స్పందించాడు. 'సినిమా అమ్మ ముద్దు బిడ్డలు.. 2020 అద్భుతమైన ఫొటోతో ప్రారంభమైంది' అని మనోజ్ ట్వీట్ చేశాడు. 

చిరంజీవి, మహేష్ తో మొదలైన రచ్చ..'మా' పరువు తీసిన సంఘటనలు!

పనిలో పనిగా అభిమానులు మోహన్ బాబు, చిరు తనయుల ఫోటోలని కూడా ట్రెండ్ చేసేస్తున్నారు. గతంలో రామ్ చరణ్, మంచు మనోజ్ కలసి ఉన్న ఓ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఫోటోని చిరంజీవి, మోహన్ బాబు ఫొటోతో పోల్చుతూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఫ్రెండ్ షిప్ గోల్స్.. తండ్రులలాగే తనయులు కూడా అని ఓ అభిమాని చేసిన ట్వీట్ పై మంచు మనోజ్ 'అంతేగా అంతేగా' అని కామెంట్ చేశాడు.