తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో కొత్త వివాదం మొదలయింది. నూతన సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా 'మా' అసోసియేషన్ డైరీని గురువారం రోజు పార్క్ హయత్ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, మోహన్ బాబు, మురళి మోహన్, టి సుబ్బిరామిరెడ్డి అతిథులుగా హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో రాజశేఖర్ ప్రవర్తన వివాదానికి దారితీసింది. మా అసోసియేషన్ లో గత కొన్ని నెలలుగా నెలకొన్న పరిస్థితులపై డైరీ లాంచ్ కార్యక్రమంలో చర్చ జరిగింది. ఎన్ని గొడవలు ఉన్న సర్దుకుపోవాలి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు రాజశేఖర్ కు నచ్చలేదు. దీనితో రాజశేఖర్ నిప్పుంటే పొగ దాగదని.. గొడవల గురించి చర్చించాల్సిందే అని పట్టుబట్టారు. 

పలు సందర్భాల్లో చిరంజీవి ప్రసంగానికి అడ్డు తగిలారు. దీనితో చిరంజీవి, మోహన్ బాబు అసహనం వ్యక్తం చేశారు. ఈ సంఘటన తర్వాత రాజశేఖర్ అక్కడికి నుంచి అలిగి వెళ్లిపోయారు. దీనితో ఆయన సతీమణి జీవిత డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. రాజశేఖర్ ది చిన్నపిల్లల మనస్తత్వం అని.. ఆయన మాటలు పట్టించుకోవద్దని చిరంజీవిని క్షమాపణలు కోరారు. 

బ్రేకింగ్: చిరంజీవితో గొడవ.. మనస్తాపంతో రాజశేఖర్ రాజీనామా

తామేమి దేవుళ్ళం కాదని.. అన్ని చోట్ల చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయని జీవిత అన్నారు. ఈ గొడవలని మీడియాలో పెద్దవి చేసి చూపించొద్దని కోరారు. తాము బాత్రూంలో పడిపోయినా ముందుగా మీడియా వాళ్లకు తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ దాయడానికి ఏమీ లేదు. మీరు డబ్బులిచ్చి మా సినిమాలు చూస్తున్నారు. కాబట్టి మా సినిమాల గురించి మీరు కామెంట్స్ చేయవచ్చు. 

చిరంజీవి, మహేష్ తో మొదలైన రచ్చ..'మా' పరువు తీసిన సంఘటనలు!

కానీ తమ వ్యక్తిగత జీవితాలపై కామెంట్స్ చేసే హక్కు మీడియాకు లేదని జీవిత అన్నారు. తామేమి మీ ఇంట్లో కట్టేసుకున్న కుక్కలమో, గేదెలమో కాదని.. తమ వ్యక్తిగత జీవితాల గురించి మీడియాలో చర్చించవద్దని జీవిత కోరారు.