పార్క్ హయత్ హోటల్ లో జరిగిన మా అసోసియేషన్ డైరీ లాంచ్ కార్యక్రమంతో టాలీవుడ్ లో మరో కొత్త వివాదానికి తెరతీసినట్లైంది. నూతన సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా 'మా' అసోసియేషన్ డైరీని గురువారం రోజు లాంచ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, మురళి మోహన్, టి సుబ్బిరామిరెడ్డి, కృష్ణం రాజు అతిథులుగా హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో రాజశేఖర్ ప్రవర్తన వివాదానికి దారితీసింది. మా అసోసియేషన్ లో గత కొన్ని నెలలుగా నెలకొన్న పరిస్థితులపై చిరంజీవి, రాజశేఖర్ మధ్య మాటల యుద్ధం సాగింది. మా అసోసియేషన్ లో ఒక ఫ్యామిలీలాగా సర్దుకుపోవాలి చిరంజీవి సూచించారు. ఏవైనా గొడవలు ఉంటే మనమే కూర్చుని చర్చించుకోవాలని, మీడియా ముందు మాట్లాడవద్దని చిరంజీవి అన్నారు. 

చిరంజీవి, మోహన్ బాబుపై గౌరవం ఉంది.. కానీ.. రాజశేఖర్ ఎమోషనల్!

ఇలాంటి విషయాలు దాచినా దాగవని, అందరి ముందు చర్చించాల్సిందే అని రాజశేఖర్ అనడంతో చిరు అసహనానికి గురయ్యారు. తామేమి చిన్నపిల్లలం కాదని రాజశేఖర్ అన్నారు. మా అసోసియేషన్ విభేదాల గురించి రాజశేఖర్ మాట్లాడుతూనే ఉండడంతో చిరంజీవితో పాటు వేదికపై ఉన్న కృష్ణం రాజు కూడా ఆశ్చర్య పోయారు. ఏంటిది.. ఏం జరుగుతోంది అని కృష్ణం రాజు అసహనం వ్యక్తం చేశారు. 

కుక్కలమో, గేదెలమో కాదు.. ఆ హక్కు మీకు లేదంటూ జీవిత ఫైర్!

మరోవైపు సీనియర్ నటి జయసుధ రాజశేఖర్ ని సముదాయిస్తూ.. కంట్రోల్ రాజశేఖర్ అని అతడిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినా రాజశేఖర్ వినిపించుకోలేదు. ఈ సంఘటన ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. జరిగిన ఈ పరిణామాల అనంతరం మా ఉపాధ్యక్షుడిగా రాజీనామా చేస్తున్నట్లు రాజశేఖర్ సంచలన నిర్ణయం ప్రకటించారు. 

చిరు వెర్సస్ రాజశేఖర్ : గొడవల చరిత్ర ఇదీ!