మా అసోసియేషన్ డైరీ లాంచ్ కార్యక్రమంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో కొత్త వివాదం మొదలయింది. నూతన సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా 'మా' అసోసియేషన్ డైరీని గురువారం రోజు పార్క్ హయత్ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో లాంచ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, మురళి మోహన్, టి సుబ్బిరామిరెడ్డి అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. 

ఈ కార్యక్రమంలో రాజశేఖర్ ప్రవర్తన వివాదానికి దారితీసింది. మా అసోసియేషన్ లో గత కొన్ని నెలలుగా నెలకొన్న పరిస్థితులపై చిరంజీవి, రాజశేఖర్ మధ్య మాటల యుద్ధం సాగింది. మా అసోసియేషన్ లో ఒక ఫ్యామిలీలాగా సర్దుకుపోవాలి చిరంజీవి సూచించారు. మాలో  జరుగుతున్న సంగతులు బయటపెట్టాల్సిందే అని రాజశేఖర్ డిమాండ్ చేశాడు. 

చిరంజీవి, మహేష్ తో మొదలైన రచ్చ..'మా' పరువు తీసిన సంఘటనలు!

చిరంజీవి, మోహన్ బాబు రాజశేఖర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. దీనితో రాజశేఖర్ వాళ్ళ కళ్ళకు నమస్కరించి అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయారు. ఈ మొత్తం ఎపిసోడ్ పై మనస్తాపానికి గురైన రాజశేఖర్ 'మా' ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా తన ట్విటర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

కుక్కలమో, గేదెలమో కాదు.. ఆ హక్కు మీకు లేదంటూ జీవిత ఫైర్!

ఈ రోజు జరిగిన సంఘటన పూర్తిగా నాకు.. మా అసోసియేషన్, నరేష్ కు మధ్య జరిగినది మాత్రమే. అక్కడ పరిస్థితులు సరిగ్గా లేవు. అందుకే నేను చూస్తూ సైలెంట్ గా ఉండలేకపోయా. దయచేసి దీనిని నాకు.. చిరంజీవి, మోహన్ బాబు మధ్య గొడవగా తప్పుగా అర్థం చేసుకోవద్దు. అతిథులకు అసౌకర్యాన్ని కలిగించినందుకు క్షమాపణలు చెబుతున్నా. 

చిరు వెర్సస్ రాజశేఖర్ : గొడవల చరిత్ర ఇదీ!

మాలో జరుగుతున్న సంఘటనల గురించి మాట్లాడడానికి ఇదే సరైన సమయం. నేను ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నా. కానీ చిత్ర పరిశ్రమకు నేను చేస్తానని హామీ ఇచ్చిన అంశలని నా సొంతంగా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తా. ఇది నాకు, చిరంజీవి, మోహన్ బాబు మధ్య జరిగిన సంఘటనగా పెద్దది చేసి చూపించవద్దు. వాళ్ళిద్దరిపై నాకు గౌరవం ఉంది అని రాజశేఖర్ ట్వీట్ చేశారు.