అల వైకుంఠపురములో చిత్రం క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇలాంటి చిత్రానికి వివాదాలు వస్తాయని ఎవరైనా ఊహించగలరా. కానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డేకు ఊహించని విమర్శలు ఎదురవుతున్నాయి. అల వైకుంఠపురములో చిత్రం అంతా బావున్నప్పటికీ.. పూజా హెగ్డే కాళ్లపై చిత్రీకరించిన సన్నివేశాలకు కొన్ని వర్గాల ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

దీనిపై పూజా హెగ్డేకు ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. పూజా హెగ్డే తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. కొందరు చేసే కామెంట్స్ విచిత్రంగా ఉంటాయి. నడుము చూపిస్తే తప్పు లేదు.. కానీ కాళ్ళు చూపిస్తే మాత్రం తప్పు అంటారు. అమ్మాయిలు చీర కట్టుకుంటే నడుము మొత్తం కనిపిస్తుంది. అలాంటప్పుడు కామెంట్స్ చేయరు. కానీ క్రాప్ టాప్, జీన్స్ వేసుకుంటే మాత్రం తప్పు అని చెబుతారు. 

అంటే వారి దృష్టిలో నడుము అనేది నార్మల్.. కాళ్లు మాత్రం నార్మల్ కాదు. ఈ ధోరణి మారాలి అని పూజా హెగ్డే తెలిపింది. అల వైకుంఠపురములో చిత్రంలో అమ్మాయి నడకని ఉద్దేశిస్తూ సామజవరగమన అనే పాట రాశారు. గతంలో ఎప్పుడూ అమ్మాయి అందాన్ని వర్ణిస్తూ పాటలే రాలేదా ? అమ్మాయి నడుము గురించే ఎన్నో పాటలు వచ్చాయి అని పూజా సమాధానం ఇచ్చింది. 

తెల్ల బికినీలో నాజూకు అందం,నలభైల్లోనూ నిట్టూర్పూలే

నేను బీచ్ లొకేషన్ లో పెరిగాననుకోండి.. అక్కడ బికినీ వేసుకోవడం నార్మల్. బీచ్ ప్రదేశాల్లో ఉండే నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు. బీచ్ లో చాలా మందికి అమ్మాయిలు బికినిలో కనిపిస్తారు. వారి వంక నా ఫ్రెండ్ తదేకంగా చూడడు. ఎందుకంటే అక్కడ బికినీ అనేది నార్మల్. మనం పెరిగిన విధానంలో.. చూసే దృష్టిలోనే అంతా ఉంటుందని పూజా తెలిపింది. 

చిరు కుమార్తె ప్రేమ వివాహంలో ఆయన కుట్ర.. పోసాని ఘాటు వ్యాఖ్యలు!

అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన అల వైకుంఠపురములో చిత్రం సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే ఈ చిత్రం 130 కోట్లకు పైగా షేర్ తో దూసుకుపోతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో టబు, మురళి శర్మ, జయరాం, సచిన్ ఖేడ్కర్ కీలక పాత్రల్లో నటించారు.  

మైండ్ బ్లోయింగ్ కాంబో.. పింక్ రీమేక్, క్రిష్ తర్వాత పవన్ ఈ డైరెక్టర్ తో..