జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత వెండితెరపై మెరిసేందుకు రెడీ అవుతున్నారు.  ఇప్పటికే పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రతిభగల దర్శకుడు క్రిష్ దర్శత్వంలో ఓ భారీ చిత్రానికి కూడా పవన్ కళ్యాణ్ గ్రీన్ సింగల్ ఇచ్చేశారు. ఈ రెండు చిత్రాల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది. 

తాజాగా పవన్ అభిమానులు పండగ చేసుకునే అప్డేట్ ఒకటి టాలీవుడ్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, పవన్ కళ్యాణ్ క్రేజీ కాంబోలో హ్యాట్రిక్ చిత్రం రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు లాంటి చిత్రాలు తెరకెక్కాయి. 

షర్ట్ బటన్ తీసేసి సెక్సీ ఫోజులు.. రెచ్చిపోయిన హాట్ బ్యూటీ!

పూరి జగన్నాధ్ బద్రి చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో పూరి టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయారు. వీరిద్దరి కాంబోలో ఎప్పుడు సినిమా వచ్చినా అభిమానుల్లో ఆసక్తి ఉంటుంది. 

ఆండ్రియాకు వార్నింగ్ ఇచ్చిన పవన్ హీరోయిన్.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

గతంలో పూరి పవన్ కోసం అనేక కథలు సిద్ధం చేశారు. కానీ అవేవి పట్టాలెక్కలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతూనే పింక్ రీమేక్ చిత్రంలో నటిస్తున్నారు. పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే విజయ్ దేవరకొండ చిత్రం తర్వాత పూరి డైరెక్ట్ చేయబోయేది పవన్ నే కావచ్చు.