మెగా బ్రదర్ నాగబాబు కొన్ని రోజుల క్రితం జబర్దస్త్ స్థో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాగబాబు మరో ప్రముఖ ఛానల్ లో జబర్దస్త్ తరహాలోనే అదిరింది అనే షో ప్రారంభించారు. నాగబాబు జడ్జిగా మరో కొత్త కామెడీ షో అనగానే మంచి పబ్లిసిటీ వచ్చింది. 

'డైరెక్టర్, హీరోతో పడుకుంటే ఆఫర్ ఇస్తాం'.. స్టార్ హీరో కుమార్తె షాకింగ్ కామెంట్స్!

కానీ కంటెంట్ పరంగా ఈ షో జబర్దస్త్ స్థాయిలో నిలువలేకపోయింది. ఇప్పుడిప్పుడే అదిరింది షోకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అదిరింది షోలో కొన్ని మార్పులు చేయాలని నాగబాబు డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా యాంకర్ ని మార్చేశారు. ఇప్పటివరకు అదిరింది షోకు సమీరా యాంకరింగ్ చేసింది. 

RRRకు గుండెల్లో దేశభక్తిని నింపే టైటిల్.. గాంధీ నోట పదేపదే ఆ పాట!

ఆమెని తప్పింది మరో ఇద్దరు యాంకర్లని నాగబాబు రంగంలోకి దించారు. ఇద్దరిలో ఒకరు మేల్ యాంకర్ కాగా మరొకరు ఫిమేల్. అది మరెవరో కాదు.. మంచి క్రేజ్ సొంతం చేసుకున్న రవి అదిరింది షోకి యాంకరింగ్ చేయబోతున్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 2 లో మెరిసిన నటి భానుశ్రీ కూడా అదిరింది షోకి యాంకరింగ్ చేయనుంది. 

జయసుధ కుమారుడి మ్యారేజ్ రిసెప్షన్.. చిరంజీవి, పవన్, రాజమౌళి సందడి(ఫొటోస్)

రవి, భానుశ్రీ జోడితో అదిరింది షోకి కొత్త జోష్ రానుంది. షోకి కొత్త గ్లామర్ తీసుకురావడంలో ఫీమేల్ యాంకర్లది ప్రముఖ పాత్ర. అలాగే ఎలాంటి కామెడీ షోలో యాంకర్స్ కూడా సందర్భానుసారంగా జోక్స్ వేస్తూ ఉండాలి. అందులో రవి ఆరితేరిపోయాడు. అందువల్లే నాగబాబు వీరిద్దరిని ఈ షోకి యాంకర్స్ గా ఎంపిక చేసుకున్నారు. వీరిద్దరూ కలసి యాంకరింగ్ చేస్తున్న తొలి ఎపిసోడ్ ప్రోమో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది.