కమర్షియల్ అంశాలతో పాటు చక్కటి సందేశాన్ని అందించడం దర్శకుడు మురుగదాస్ ప్రత్యేకత. మురుగదాస్ చిత్రాలలో కథాంశాలు వైవిధ్యంగా ఉంటాయి. తాము చెప్పదలుచుకున్న అంశాన్ని ప్రభావవంతంగా ప్రేక్షకులకు చేరేలా మురుగదాస్ చిత్రాలు తెరకెక్కించగలరు. ఇటీవల మురుగదాస్ తుపాకీ, కత్తి, సర్కార్ లాంటి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలు తెరకెక్కించారు. 

తాజాగా మురుగదాస్ దర్బార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మురుగదాస్ మాట్లాడుతూ తెలుగులో నేరుగా సినిమా చేయడం గురించి స్పందించారు. త్వరలోనే తెలుగులో స్ట్రైట్ మూవీ చేస్తానని అన్నారు. 

లవ్ ఎఫైర్స్ పై త్రిష కామెంట్స్.. మళ్లీ సూపర్ క్రేజ్ కు కారణం ?

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మురుగదాస్ అన్నారు. గతంలో తాను ఎన్టీఆర్ కు కథ వినిపించిన సంగతి వాస్తవమే అని అన్నారు. అయితే ఇటీవల ఎన్టీఆర్ ని కలవలేదు. నా తదుపరి చిత్రం గురించి ఇంకా నిర్ణయించుకోలేరు అని మురుగదాస్ అన్నారు. 

తమన్నా కెరీర్ లో బెస్ట్ మూవీస్.. పెర్ఫామెన్స్ చింపేసింది!

ఇక మహేష్ బాబుతో తెరకెక్కించిన స్పైడర్ చిత్రం నిరాశపరచడంపై మురుగదాస్ కామెంట్స్ చేశారు. ఆ చిత్రంతో మహేష్ ని ప్రధానంగా తమిళంలో హైలైట్ చేయాలని అనుకున్నా. అందుకే తమిళ నేటివిటీకి అనుగుణంగా ఆ చిత్రాన్ని తీసా. అక్కడే పొరపాటు జరిగింది అని మురుగదాస్ చెప్పుకొచ్చారు. ఇకపై తెలుగు సినిమాలు చేసే సమయంలో అలాంటి తప్పులు చేయనని మురుగదాస్ అన్నారు. 

గ్యాంగ్ లీడర్ తో రాములమ్మ.. ఎన్నో ఏళ్ల తర్వాత.. ఫాన్స్ కు పండగే!