దక్షణాదిలో త్రిష ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్. దాదాపు త్రిష 15ఏళ్లకు పైగా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తెలుగులో వర్షం చిత్రంతో త్రిష తొలి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ చిత్రం తర్వాత త్రిష ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ప్రభాస్, రవితేజ, నాగార్జున, మహేష్, చిరంజీవి లాంటి స్టార్స్ అందరితో సక్సెస్ ఫుల్ చిత్రాల్లో త్రిష నటించింది. 

పాత నీరుపోయి కొత్త నీరు వచ్చినట్లు.. కుర్ర హీరోయిన్ల హవాతో కొన్నేళ్లు త్రిషకు సరైన సక్సెస్ అవకాశాలు లేవు. ఇక త్రిష పనైపోయింది అని అంతా భావించారు. కానీ 36 ఏళ్ళ త్రిష 96 అనే ప్రేమ్ కథా చిత్రంలో నటించి ఆశ్చర్యపరిచింది. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో త్రిష క్రేజ్ మళ్లీ పెరిగిపోయింది. ప్రస్తుతం త్రిషకు పలు అవకాశాలు వస్తున్నాయి. 

త్రిష ఎప్పుడు ప్రేమకథా చిత్రాల్లో నటించినా ఆమెకు విజయం వరిస్తూనే ఉంది. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, విన్నైతాండి వరువాయా , 96 చిత్రాలన్నీ ప్రేమ కథలే. తాజాగా మీడియాతో త్రిష మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మంచి ప్రేమ కథని ప్రేక్షకులు ఎప్పుడైనా ఆదరిస్తారని పేర్కొంది. కానీ తన లైఫ్ లో మాత్రం ఎలాంటి లవ్ స్టోరీ లేదని తెలిపింది. తానెప్పుడూ ఎవరితోనూ ప్రేమలో పడలేదని త్రిష పేర్కొంది. 

96 చిత్రంలో నాది మంచి పాత్ర అని తెలుసు. కానీ ఆ చిత్రం అంత పెద్ద సక్సెస్ అవుతుందని కానీ, ఎల్లో చుడిదార్ ధరించిన అమ్మాయి పాత్రలో తన నటనకు అంత గుర్తింపు వస్తుందని కానీ తాను ఊహించలేదని త్రిష పేర్కొంది. అంతకు ముందు తనకు జెస్సి పాత్ర కూడా ఇలాంటి గుర్తింపునే తీసుకువచ్చినట్లు త్రిష తెలిపింది. స్కూల్ లైఫ్ లో కానీ, కాలేజ్ లైఫ్ లో కానీ నాకు ఎలాంటి ప్రేమ కథలు లేవని త్రిష సరదాగా పేర్కొంది. 

తమన్నా కెరీర్ లో బెస్ట్ మూవీస్.. పెర్ఫామెన్స్ చింపేసింది!

ఆ మద్యన త్రిషకు ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగింది. కానీ కొన్ని కారణాలవల్ల ఈ జంట పెళ్లి కాకముందే విడిపోయారు. త్రిష ప్రస్తుతం వరుస ఆఫర్స్ సొంతం చేసుకుంటోంది. త్వరలో మెగాస్టార్ చిరంజీవి సరసన కొరటాల శివ దర్శత్వంలో నటించబోతోంది. 

మతిపోగొట్టేలా బికినీలో హాట్ బ్యూటీ .. ఫొటోస్ వైరల్