ప్రభుత్వానికి చిరంజీవి డిమాండ్.. మహేష్ మనసు దోచుకున్న మెగాస్టార్!
ఆదివారం రోజు జరిగిన సరిలేరు నీకెవ్వరు మెగా సూపర్ ఈవెంట్ లో అనేక విశేషాలు చోటు చేసుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, లేడీ అమితాబ్ విజయశాంతి, సూపర్ స్టార్ మహేష్ ఒకే వేదికపై కనిపించడమే అభిమానులకు పెద్ద పండగ. ఇక ఈ ఈవెంట్ లో చిరంజీవి, మహేష్, విజయశాంతి తమ ప్రసంగాలతో ఆకట్టుకున్నారు.
ఆదివారం రోజు జరిగిన సరిలేరు నీకెవ్వరు మెగా సూపర్ ఈవెంట్ లో అనేక విశేషాలు చోటు చేసుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, లేడీ అమితాబ్ విజయశాంతి, సూపర్ స్టార్ మహేష్ ఒకే వేదికపై కనిపించడమే అభిమానులకు పెద్ద పండగ. ఇక ఈ ఈవెంట్ లో చిరంజీవి, మహేష్, విజయశాంతి తమ ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. చివర్లో చిరంజీవి, విజయశాంతి మధ్య జరిగిన సరదా సంభాషణ అయితే ఈవెంట్ మొత్తానికే హైలైట్ గా నిలిచింది.
చిరంజీవి, విజయశాంతి పాత సంగతులు గుర్తుచేసుకుంటూ అభిమానులని అలరించారు. ఇక చిరంజీవి తన స్పీచ్ లో అనేక అంశాల గురించి మాట్లాడారు. 2019 సంవత్సరానికి గాను చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని అమితాబ్ బచ్చన్ అందుకున్నారు. ఈ ఏడాది సూపర్ స్టార్ కృష్ణగారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దక్కేలా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాన్ని గట్టి ప్రయత్నం చేయాలని చిరంజీవి డిమాండ్ చేశారు.
సరిలేరు ప్రీరిలీజ్: పోకిరి చూశాక చిరంజీవి గారు రెండు గంటలపాటు.. : మహేష్
ఇండియాలో ఉన్న సీనియర్ నటులలో కృష్ణ గారు ఒకరు. ఆయనకు దక్కాల్సిన గౌరవం ఇంకా దక్కలేదు. కృష్ణగారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా అని చిరంజీవి అన్నారు. కృష్ణ గారికి అత్యున్నత పురస్కారం దక్కితే తెలుగు సినిమాకు గౌరవం దక్కినట్లే అని చిరంజీవి అన్నారు.
సరిలేరు ప్రీరిలీజ్: నన్ను అన్నేసి మాటలు ఎందుకు తిట్టావ్ విజయశాంతి: చిరంజీవి!
సూపర్ స్టార్ కృష్ణ అంటే నటుడు మాత్రమే కాదు.. ధైర్య సాహసాలకు ఆయన పెట్టింది పేరు అని చిరంజీవి అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు తరలి రావడానికి ప్రధాన కారకుల్లో ఆయన కూడా ఒకరు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు కృష్ణగారు అన్ని విధాలా అర్హుడు అని చిరంజీవి అన్నారు. తన తండ్రికి గౌరవం దక్కాలని మెగాస్టార్ అంతటి వ్యక్తి మాట్లాడడం మహేష్ బాబుకు సంతోషాన్నిచ్చే అంశమే.
సరిలేరు ప్రీరిలీజ్: పరోక్షంగా పవన్ పేరు..ఎర్రి డాష్ అనిపించుకున్నా: బండ్ల గణేష్