సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటించిన ఈ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. లేడి అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకని నేడు ఎల్బీస్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలిసారి మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు చిత్రం కోసం చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. 

వేదికపై మెగాస్టార్ చిరంజీవి ప్రసంగం ఆద్యంతం అభిమానులని అలరించింది. సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ ని, మహేష్ బాబుని ప్రశంసించిన తర్వాత చిరు విజయశాంతిని సరదాగా టార్గెట్ చేశాడు. ఒక చిన్న పాటి చర్చే వేదికపై వారిద్దరి మధ్య జరిగింది. 

విజయశాంతి నన్ను 15 ఏళ్ల పాటు వదిలేసి వెళ్ళిపోయింది. చెన్నై లో ఉన్నప్పుడు మా ఇద్దరి ఇల్లు ఎదురెదురుగానే అని చిరంజీవి అన్నారు. విజయశాంతి గురించి చిరు మాట్లాడడం ప్రారంభించగానే స్టేడియం కేరింతలతో హోరెత్తిపోయింది. చిరు మాట్లాడుతుండగానే విజయశాంతి అతడి పక్కన వచ్చి నిలబడింది. ఇద్దరూ ఒకరి భుజాలపై ఒకరు చేయి వేసుకుని సరదాగా మాట్లాడుకున్నారు. 

శాంతి నిన్ను ఒకటి అడగలనుకుంటున్నాను. అడుగు అని విజయశాంతి అంది. నాకంటే ముందుగా నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళావు కదా.. అవును వెళ్లాను అయితే ఏంటి అని విజయశాంతి బదులిచ్చింది. నేను రాజకీయాల్లోకి వెళ్లి 22 ఏళ్ళు అవుతోంది. నన్ను అన్నేసి మాటలు అనాలని ఎలా అనిపించింది శాంతి అని చిరు సరదాగా ప్రశ్నించారు. దీనితో వేదికపై ఉన్న ప్రతి ఒక్కరూ నవ్వేశారు. 

చిరు ప్రశ్నకు విజయశాంతి హుందాగా బదులిచ్చింది. రాజకీయాలు వేరు.. సినిమా వేరు. ఏమి జరిగినా మీరు నా హీరో.. నేను మీ హీరోయిన్. మన మధ్య స్నేహం అయితే చెక్కు చెదరదు. పోలీసులు కూడా డ్యూటీలో ఉన్నప్పుడు ఫ్యామిలీని కూడా పట్టించుకోరు. ఇక్కడ కూడా అంతే. రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు తప్పదు అని విజయశాంతి తెలిపింది. 

చిరంజీవితో విజయశాంతి సరదాగా డైలాగ్ కూడా కొట్టింది. చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో.. రఫ్ ఆడించేస్తా అని చెప్పగానే అభిమానులు విజిల్స్ కొట్టారు.