సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటించిన ఈ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. లేడి అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకని నేడు ఎల్బీస్టేడియంలో ఘనంగా నిర్వహించారు. తొలిసారి మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు చిత్రం కోసం చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.

మహేష్ బాబు మాట్లాడుతూ.. చిరంజీవి గారు తనకు ఎంతో ఆదర్శం అని అన్నాడు. చాలా ఏళ్లుగా ఆయన నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. అర్జున్, ఒక్కడు, పోకిరి చిత్రాలు విజయం సాధించినప్పుడు నన్ను అభినందించింది ఆయనే. ఇప్పటికే నా సినిమా రిలీజైతే చిరంజీవి గారి దగ్గర నుంచే ఫస్ట్ కాల్ వస్తుంది అని మహేష్ తెలిపాడు.    

అర్జున్ చిత్ర సెట్స్ కి వచ్చి మరీ అభినందించారు. టాలీవుడ్ కు నీ లాంటి నటుడు అవసరం మహేష్ అని అన్నారు. పోకిరి సినిమా రిలీజైనప్పుడు పూరి జగన్నాధ్ గారి ఆఫీస్ లో ఆయన సినిమా చూశారు. అక్కడకు నన్ను పిలిపిస్తే వెళ్లాను. దాదాపు రెండు గంటల పాటు పోకిరి సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజైన తర్వాత కూడా ఫస్ట్ ఫోన్ కాల్ అయన దగ్గర నుంచే రావాలి అని మహేష్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 

విజయశాంతి గురించి మాట్లాడుతూ.. కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో ఎలా ఉన్నారో ఆమె ఇప్పటికీ అలానే ఉన్నారని మహేష్ తెలిపాడు. అనిల్ రావిపూడి కథ చెప్పగానే.. విజయశాంతి గారి గురించి చర్చించుకున్నాం. ఆమె ఒప్పుకుంటుందా అని అనిల్ ని అడిగా. కానీ అనిల్ మాత్రం వెంటపడి మరీ ఒప్పించాడు అని మహేష్ తెలిపాడు. 

సరిలేరు ప్రీరిలీజ్: నన్ను అన్నేసి మాటలు ఎందుకు తిట్టావ్ విజయశాంతి: చిరంజీవి!

సరిలేరు ప్రీరిలీజ్: వెయ్యి గుండె ఆపరేషన్స్.. పట్టుకుంటే కందిపోతాడు: విజయశాంతి!

సరిలేరు ప్రీరిలీజ్: చిరు, విజయశాంతి సినిమాల పేర్లు చెప్పగానే.. రష్మిక చెప్పిన సీక్రెట్!