సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటించిన ఈ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. లేడి అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకని నేడు ఎల్బీస్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలిసారి మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు చిత్రం కోసం చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.   

ప్రీరిలీజ్ వేడుకలో విజయశాంతి తన పవర్ ఫుల్ స్పీచ్ తో అదరగొట్టింది. 1979లో తన సినీ కెరీర్ ప్రారంభమైందని విజయశాంతి తెలిపారు. యాక్షన్ చిత్రాలు చేశా. గ్లామర్ రోల్స్ లో నటించా. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటించా అని విజయశాంతి తెలిపారు. 

హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల గురించి మాట్లాడుతూ.. అణగదొక్కబడిన మహిళల కోసం ఎన్నో చిత్రాలు చేశా. మహిళలు భయపడకండి.. మీరు సాధించలేనిది ఏమీ లేదు అని విజయశాంతి అన్నారు. 

ఇక ఆమె మహేష్ బాబుని ప్రశంసలతో ముంచెత్తారు. 1988లో లిటిల్ మహేష్ ని చూశా. చాలా అమాయకంగా ఉండేవాడు. ఇప్పటికి అలాగే ఉన్నాడు. పట్టుకుంటే కందిపోతాడు. మహేష్ బాబు రియల్ సూపర్ స్టార్. మహేష్ బాబు 1000 గుండె ఆపరేషన్స్ చేయించాడని తెలుసుకుని ఆశ్చర్యపోయా, మామూలు విషయం కాదు. ఇంత గొప్ప పని చేస్తున్న మహేష్ కుటుంబాన్ని ఆ దేవుడు 100 ఏళ్ళు చల్లగా చూడాలి అని విజయశాంతి ఆశీర్వదించారు. 

సరిలేరు నీకెవ్వరు ట్రైలర్: నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. బొమ్మ దద్దరిల్లింది!

ఇక చిరంజీవి గురించి మాట్లాడుతూ.. ఆయన్ని చాలా రోజుల తర్వాత చూస్తున్నానని అన్నారు. మా ఇద్దరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఆ సంగతులన్నీ ఇప్పుడు నాకు గుర్తుకొస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి విజయశాంతి శుభాకాంక్షలు తెలిపారు.