వివాదాల రాణి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో నిత్యం ప్రముఖులపై విమర్శలు చేస్తూ పబ్లిసిటీ పొందుతూ ఉంటుంది. కాస్టింగ్ కౌచ్ పోరాటంలో భాగంగా శ్రీరెడ్డి అర్థ నగ్న నిరసనతో ఇండియా మొత్తం సంచలనం సృష్టించింది. తరచుగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరోలని, హీరోయిన్లని పరోక్షంగా టార్గెట్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్న సంగతి తెలిసిందే. 

తాజాగా శ్రీరెడ్డి నెటిజన్లని కన్ఫ్యూజన్ లో పడేసింది. టిక్ టాక్ వీడియోలో భాగంగా శ్రీరెడ్డి మెడలు మంగళ సూత్రం.. నుదుటిన సింధూరంతో పెళ్ళైన యువతిలా కనిపించింది. దీనితో శ్రీరెడ్డి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం శ్రీరెడ్డి ఓ యువ తమిళ దర్శకుడిని రహస్యంగా పెళ్లి చేసుకుందని అంటున్నారు. శ్రీరెడ్డి మాత్రం తాను వీడియో కోసమే మెడలో మంగళ సూత్రం వేసుకున్నట్లు చెప్పుకొచ్చింది.