దాదాపు మూడేళ్ళ క్రితం బాహుబలి 2 చిత్రంతో రాజమౌళి సృష్టించిన సంచలనాల గురించి, తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది. బాహుబలి 2 తర్వాత రాజమౌళి తెరకెక్కించబోయే చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. మరోసారి రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఎంచుకున్నారు. రాంచరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా స్వాతంత్ర ఉద్యమం నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

రాంచరణ్ అల్లూరి సీతా రామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో ఈ చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ చరణ్ కు హీరోయిన్ గా సీత పాత్రలో నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ హీరోయిన్ గా ఫారెన్ ముద్దుగుమ్మ ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఆమె పాత్ర పేరు జెన్నిఫర్. 

RRR టీమ్ లో బాలీవుడ్ హీరో.. ఆట మొదలైంది!

ఈ చిత్రంలో విలన్ పాత్రలో కూడా ఫారెన్ నటీనటులే నటిస్తున్నారు. లేడీ స్కాట్ పాత్రలో అలిసన్, స్కాట్ పాత్రలో రే స్టీవెన్సన్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో నటించే ప్రధాన నటీనటుల పాత్రల పేర్లని రాజమౌళి బయటపెట్టారు. కానీ ఆర్ఆర్ఆర్ లో కీ రోల్ ప్లే చేస్తున్న అజయ్ దేవగన్ పాత్ర పేరుని రాజమౌళి ప్రకటించలేదు.  

అల్లు అర్జున్ నిజమైన 'మెగా పవర్ స్టార్'.. కుంపటి పెట్టే ప్రయత్నమా?

మంగళవారం రోజే అజయ్ దేవగన్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. దీనితో అజయ్ దేవగన్ పాత్రకు సంబందించిన చర్చ మళ్ళీ మొదలయింది.స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్ రోల్ ఏంటి.. ఆయన పాత్రతో ఎన్టీఆర్, రాంచరణ్ కు సంబంధం ఏంటి అనే ఆసక్తికరమైన ప్రశ్నలు చర్చకు వస్తున్నాయి. 

బాలయ్య సినిమా రిజెక్ట్ చేసిన క్రేజీ హీరోయిన్.. అక్కడే తేడా వచ్చింది!

రాజమౌళి పేరు కూడా ప్రకటించలేదంటే.. ఆ పాత్ర గొప్పగా ఉండబోతోందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాల ప్రకారం అజయ్ దేవగన్ ఈ చిత్రంలో ఉత్తరాదిలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనే విప్లవ వీరుడిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

అజయ్ దేవగన్ కు స్వాతంత్ర ఉద్యమ బ్యాక్ డ్రాప్ ఉన్న చిత్రాల్లో నటించడం కొత్తేమి కాదు. భగత్ సింగ్ చిత్రంలో నటించిన అజయ్ దేవగన్ ఏకంగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్నాడు.