ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు.. రీసెంట్ గా రూలర్ ఇలా వరుసగా బాలయ్య నుంచి నందమూరి అభిమానులకు నిరాశ తప్పడం లేదు. నందమూరి ఫ్యాన్స్ అంతా బాలయ్య నుంచి ఓ మంచి చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వారి ఆశలన్నీ దర్శకుడు బోయపాటి పైనే ఉన్నాయి. 

బోయపాటి, బాలయ్య హ్యాట్రిక్ కాంబినేషన్ లో ఇటీవల ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. నటీనటుల్ని ఎంపిక చేసి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలనే ఆలోచనలో బోయపాటి ఉన్నారు. ఈ చిత్రంలో బాలయ్య డిఫెరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఇప్పటికే గుండుతో ఉన్న ఫోటోలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

ఇదిలా ఉండగా ఈ చిత్రంలో బాలయ్య సరసన నటించే హీరోయిన్ కోసం బోయపాటికి తంటాలు తప్పడం లేదు. తరచుగా ఏదో ఒక హీరోయిన్ పేరు వినిపించడం.. తీరా సదరు బ్యూటీ ఆ వార్తలని ఖండించడం మామూలైపోయింది. క్రేజీ హీరోయిన్ కేథరిన్ ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. 

తాజా సమాచారం మేరకు కేథరిన్ బాలయ్య చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. బోయపాటి కేథరిన్ సంప్రదించగా అంతా ఓకే అయింది. కానీ రెమ్యునరేషన్ విషయంలోనే తేడా కొట్టిందట. కేథరిన్ భారీగా పారితోషికం డిమాండ్ చేయడంతో నిర్మాతలు ఆశ్చర్యపోయారు. డీల్ కుదరకపోవడంతో కేథరిన్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. 

అల్లు అర్జున్ నిజమైన 'మెగా పవర్ స్టార్'.. కుంపటి పెట్టే ప్రయత్నమా?

ఆ మధ్యన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షిబాలయ్యతో రొమాన్స్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలని సోనాక్షి ఖండించింది. మొత్తానికి బాలయ్యకు హీరోయిన్ ని వెతకడం బోయపాటికి పెద్ద సవాల్ గా మారినట్లు ఉంది.