స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల విడుదలైన 'అల వైకుంఠపురములో' చిత్రంతో ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. బన్నీ చివరగా నటించిన  నా పేరు సూర్య చిత్రం ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. దీనితో మరో చిత్రం కోసం బన్నీ అభిమానులని ఎక్కువ రోజులు వెయిటింగ్ పెట్టాడు. కానీ అభిమానుల ఎరుచూపులకు తగ్గట్లుగానే ఓ అద్భుతమైన చిత్రంతో ముందుకు వచ్చాడు. 

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసి దూసుకుపోతోంది. కాస్త పబ్లిసిటీ అనిపించే విషయం ఏది దొరికినా వర్మ వదిలిపెట్టడు. ట్విటర్ వేదికగా తన నోటికి పదును పెడుతుంటాడు. 

సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలలో ఏది పెద్ద విజయం అనే చర్చ అభిమానుల్లో జరుగుతోంది. ఈ అంశాన్ని ఉపయోగించుకుని హీరోల అభిమానుల మధ్య రామ్ గోపాల్ వర్మ కుంపటి పెట్టే ప్రయత్నం చేశాడు. 

ఓ వివాదాస్పద ట్వీట్ చేసి వెంటనే డిలీట్ చేశాడు. 'అల్లు అర్జున్ అద్భుతమైన ఘనత సాధించాడు. లెజెండ్రీ నటుడు అల్లు రామలింగయ్య గారికి అసలైన వారసుడు అనిపించుకున్నాడు. సూపర్ స్టార్లు, మెగా స్థాయి ఉండే హీరోలు సైతం అసూయ చెందే నటుడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ నిజమైన మెగా పవర్ స్టార్' అని వర్మ ట్వీట్ చేశాడు. 

'నిజమైన కలెక్షన్స్'.. వివాదంపై స్పందించిన తమన్!

ఇది ఖచ్చితంగా వివాదం అయ్యే ట్వీటే. దీనితో వెంటనే డిలీట్ చేశాడు. తన ట్వీట్ లో సూపర్ స్టార్, మెగా, మెగా పవర్ స్టార్ లాంటి పదాలని వర్మ ఉపయోగించాడు. వర్మ చేసిన కామెంట్స్ ఆయా  హీరోల అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి.