Asianet News TeluguAsianet News Telugu

RRR టీమ్ లో బాలీవుడ్ హీరో.. ఆట మొదలైంది!

ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా RRR కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ని ఫినిష్ చేసిన రాజమౌళి మిగిలిన వర్క్ లో కూడా స్పీడ్ పెంచుతున్నాడు.

Ajay Devgn begins filming for SS Rajamouli RRR
Author
Hyderabad, First Published Jan 21, 2020, 12:34 PM IST

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా RRR కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ని ఫినిష్ చేసిన రాజమౌళి మిగిలిన వర్క్ లో కూడా స్పీడ్ పెంచుతున్నాడు.

Ajay Devgn begins filming for SS Rajamouli RRR

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక నేటి నుంచి ఈ సీనియర్ హీరో RRR టీమ్ తో కలిసి రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఒక ముఖ్యమైన అతిధి పాత్ర కోసం అజయ్ కొన్ని నిమిషాల పాటు బిగ్ స్క్రీన్ పై అలరించనున్నట్లు టాక్ వస్తోంది. సినిమాలో అజయ్ చేయబోయే పాత్ర చాలా పవర్ఫుల్ అని తెలుస్తోంది. ఇన్నిరోజులు చేసిన షూటింగ్ ఒక ఎత్తైతే ఇప్పుడు చేయబోయే షూటింగ్ మరోక లెవెల్ అని  తెలుస్తోంది.

Ajay Devgn begins filming for SS Rajamouli RRR

ఇక అసలైన ఆట ఇప్పుడే మొదలైనట్లు కూడా అర్ధమవుతోంది. మరీ ఆ పాత్ర ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇకపోతే టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా వైడ్ గా భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో మరొక విప్లవకారుడి హ్యాండ్ కూడా పడబోతున్నట్లు సమాచారం.  ఆ స్పెషల్ పర్సన్ మరెవరో కాదు. ప్రజా గాయకుడు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో తన గొంతుని వినిపించిన గద్దర్. ఆయన గతంలో అనేక సినిమాలకు పాటలు రాశారు. అయితే ప్రస్తుత రోజుల్లో ఆయన పెన్నుకి ఎక్కువగా పని పడలేదు.

Ajay Devgn begins filming for SS Rajamouli RRR

ఇక చాలా కాలం తరువాత ఒక పవర్ఫుల్ సాంగ్ ని రాయడానికి సిద్ధమయ్యారు. అదికూడా RRR సినిమాకు ఆయన పాట రాయనుండడం విశేషమని చెప్పాలి. అందుకు సంబందించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. RRR సినిమా విప్లవ వీరులు కొమురం భీమ్ - అల్లూరి సీతారామరాజు జీవితాల ఆధారంగా  తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  అయితే అలాంటి వీరుల ధైర్య సాహసాలను పాటలో ప్రతిబింబించేలా గద్దర్ తో దర్శకుడు రాజమౌళి సాంగ్ రాయిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు ఎండింగ్ లో ఉన్నాయి. సాంగ్స్ ని కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనీ కీరవాణితో దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక గద్దర్ సాంగ్ సినిమాలోనే హైలెట్ గా నిలవనున్నట్లు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios