వైద్యురాలు ప్రియాంకరెడ్డి అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని విషాదానికి గురిచేస్తోంది. బుధవారం రాత్రి శంషాబాద్ ప్రాంతంలో నలుగురు దుండగులు ప్రియాంక రెడ్డిపై అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం ఆమెని పెట్రోల్ పోసి తగలబెట్టి హత్య చేశారు. ఈ దారుణమైన ఘటన ప్రతి ఒక్కరి హృదయాల్ని కలచివేస్తోంది. మహిళల భద్రతపై నెలకొన్న అనుమానాల్ని ఈ ఘటన మరోసారి పెంచింది. 

ప్రియాంక మృతి పట్ల రాజకీయ ప్రముఖులు, మహిళా సంఘాలు, సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. ఇప్పటికే చిత్ర పరిశ్రమ నుంచి అనుష్క, కార్తికేయ, కీర్తి సురేష్, వరుణ్ తేజ్, హీరో రామ్, అనిల్ రావిపూడి లాంటి సెలెబ్రిటీలంతా స్పందించిన సంగతి తెలిసిందే. 

ప్రియాంక హత్య: ఈ జంతువులని ఇలా చేయండి.. చట్టానికి వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి సూచన!

తాజాగా ఈ ఘటనపై యంగ్ హీరో నిఖిల్ స్పందించాడు. ప్రియాంక హత్యకు కారణమైన దుండగులని దూషిస్తూ ఆగ్రహంగా ట్వీట్ చేశాడు. 

నిఖిల్ తన ట్విట్టర్ లో.. 'అత్యాచారం, హత్యలు చేసే నీచులకి మరణశిక్ష విధించాలి. ఇలాంటి దారుణాలు ఆపాలంటే మరణశిక్షకు మించిన మార్గం లేదు. నరేంద్ర మోడీ సర్ ఇలాంటి సంఘటనలు ఆపగలిగే పవర్ మీదగ్గర ఉంది. ఇలాంటి దారుణాలపై దృష్టి పెట్టండి. ప్రియాంక అమ్మ మమ్మల్ని క్షమించు.. నీపై ఇంతటి దారుణానికి కారణమైన సమాజంలో ఉంటున్నందుకు సిగ్గుపడుతున్నాం' అని ట్వీట్ చేశాడు. 

ప్రియాంక రెడ్డిని అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన దుండగులని పోలీసులు నేడు అదుపులోకి తీసుకున్నారు. 

ప్రియాంక రెడ్డి హత్య: 'ఒక్క తీర్పు' అంటూ హీరో రామ్ ఎమోషనల్ కామెంట్స్!

ప్రియాంకా రెడ్డి హత్య కేసు : లేచిపోయిందేమో అనడానికి సిగ్గుగా లేదా..? పూనమ్ ఫైర్!