హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసు సంచలనం సృష్టించింది. ఈ నెల 27న ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి వెళ్లిన ప్రియాంకతిరిగి ఇంటికి రాలేదు. మధ్యలో తన సోదరికి ఫోన్ చేసి స్కూటీ పంక్చర్ అయ్యిందని తనకు భయంగా ఉందని చెప్పిన కొద్ది సేపటికే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. 

బుధవారం నాడు మిస్ అయిన ప్రియాంకారెడ్డి గురువారం తెల్లవారు జామున షాద్ నగర్ సమీపంలో శవమై తేలడంతో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. ప్రియాంక రెడ్డిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి అతిదారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టేశారు.

ప్రియాంక మర్డర్ కేసు.. వైరల్ అవుతున్న ఎన్టీఆర్ వీడియోస్

ఈ ఘటన తెలంగాణా రాష్ట్రంలో సంచలనంగామారింది. ప్రియాంకా రెడ్డిని దారుణంగా హతమార్చిన వారికి ఉరిశిక్ష అమలు చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు. అయితే ప్రియాంక మొదట ఇంటికి రాకపోయేసరికి ఆమె తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు.

ఆ సమయంలో పోలీసులు ప్రియాంకా లేచిపోయిందేమో అని ఆమె తల్లితండ్రులతో అన్నారట. ఈ విషయాన్ని వారు మీడియా ముందు బయటపెట్టారు. దీంతో ప్రజలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నటి పూనమ్ కౌర్ స్పందించింది.

పోలీస్ వ్యవస్థకు ఇది సిగ్గుచేటు చర్య అని.. ఇలా ప్రశ్నించడానికి వారికి సిగ్గుగా లేదా అంటూ మండిపడింది. తనకొచ్చిన భాషలో తిట్లు కూడా తిట్టింది. మరోపక్క ప్రియాంకా హత్యకేసులో పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం నాడు మీడియా ముందుకు తీసుకురానున్నారు.