వెండితెరపై మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కోదండరామిరెడ్డి లది తిరుగులేని కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలన్నీ దాదాపు ఘనవిజయం సాధించాయి. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ చిత్రమే చిరంజీవి కెరీర్ కు టర్నింగ్ పాయింట్. 

వీరిద్దరి కాంబోలో న్యాయం కావాలి, అభిలాష, ఖైదీ, పసివాడి ప్రాణం, కొండవీటి దొంగ, విజేత లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. కోందండ రామిరెడ్డి ఇటీవల అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోందండ రామిరెడ్డి తన కెరీర్ గురించి అనేక ఆసక్తికర సంగతులు వివరించారు. 

ఎన్నో సంవత్సరాల పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన తర్వాత దర్శకుడిగా అవకాశం వచ్చిందని తెలిపారు. 1980లో 'సంధ్య' చిత్రంతో తాను దర్శకుడిగా మారానని కోదండ రామిరెడ్డి అన్నారు. సంధ్య చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా కొన్ని హిట్ చిత్రాలు తెరకెక్కించాను. మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. 

కొన్నిరోజులు వరుసగా రెండు ఫ్లాప్ చిత్రాలు పడ్డాయి. దీనితో నాతో కమిటైన నిర్మాతలంతా వెనక్కి వెళ్లిపోయారు. అడ్వాన్సులు కూడా వెనక్కు తీసేసుకున్నారు. ఆ సమయంలో చిరంజీవితో అభిలాష చిత్రం తెరకెక్కించా. ఆ సినిమా హిట్ అయితేనే నాకు భవిష్యత్తు ఉంటుంది.. లేకుంటే లేదు. యండమూరి గారికి కూడా అదే తొలి చిత్రం. ఆయన రాసిన నవలతోనే అభిలాష చిత్రం చేశాం. 

2019లో ఈ హీరోయిన్ల పంట పండింది.. ఫ్లాపుల్లో ఉన్నవారు కూడా గట్టెక్కారు

సినిమా పూర్తై ఫస్ట్ కాపీ రెడీ అయింది. నేను ఓ పనిమీద హైదరాబాద్ వచ్చాను. మద్రాసులో అభిలాష ప్రీమియర్ షో ప్రదర్శించారు. నా భార్య ఫోన్ చేసే.. ఏవండీ ఈ సినిమా కూడా బాగాలేదని అంటున్నారు అని చెప్పింది. ప్రీమియర్ చూసిన వారికి అభిలాష కథ నచ్చలేదు. ఇదేం స్టోరీ.. సినిమా ఏమీ బాగాలేదు అని ఫ్లాప్ టాక్ ప్రీమియర్ షో నుంచి వచ్చింది. 

హీరోయిన్ భర్తకు బర్త్ డే విషెష్.. బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసిన రామ్

అది విన్న తర్వాత చాలా కుంగిపోయాను. నేను, యండమూరిగారు ట్యాంక్ బండ్ దగ్గర కలుసుకున్నాం. సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తోందని చాలా బాధపడ్డాం. అసలే వరుసగా ఫ్లాపులు.. ఈ సినిమా కూడా పోతే నా పరిస్థితి ఏంటి అని నేను.. నా తొలి నవల ఇదే.. ఈ చిత్రమే సరిగా ఆడకుంటే ఇక నా నవలలు ఎవరు కొంటారు అని యండమూరి గారు ఇద్దరం ఏడ్చేశాం. 

బాలయ్య కాన్సెప్ట్ తో చిరంజీవి చిత్రం.. డైరెక్టర్ ఎవరో తెలుసా ?

కానీ సినిమా విడుదలయ్యాక మా బాధ మొత్తం తీరిపోయింది. అన్ని ఏరియాలలో ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్. అభిలాష అద్భుతమైన హిట్ గా నిలిచింది అని కోందండ రామిరెడ్డి అన్నారు. ఖైదీ సినిమా సెకండ్ హాఫ్ గురించి కూడా నెగిటివ్ కామెంట్స్ చేశారు. కానీ సినిమా విడుదలై నన్ను, చిరంజీవి గారిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిది అని కోదండ రామిరెడ్డి అన్నారు.