ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ  హీరోగా మారిపోయాడు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో రామ్ చేసిన బాక్సాఫీస్ విధ్వంసం అంతా ఇంతా కాదు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మూవీ రామ్ కెరీర్ కు బాగా ఉపయోగపడింది. 

ప్రస్తుతం రామ్ తమిళంలో ఘనవిజయం సాధించిన 'తడం' చిత్ర రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రెడ్ అని టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇదిలా ఉండగా తాజాగా రామ్ ఓ బాలీవుడ్ హీరోకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. 

రామ్ బర్త్ డే విషెష్ తెలియజేసింది మరెవరికో కాదు.. హీరోయిన్ జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ కి. రితేష్ దేశ్ ముఖ్ మంగళవారం రోజు తన 41వ జన్మదిన వేడుక జరుపుకుంటున్నాడు. స్వీటెస్ట్ హ్యూమన్ రితేష్ కు జన్మదిన శుభాకాంక్షలు. నీవు ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అని ట్వీట్ చేశాడు. 

ఈ సందర్భంగా రామ్.. జెనీలియా, రితేష్ తో కలసి ఉన్న బ్యూటిఫుల్ పిక్ ని షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 

రామ్, జెనీలియా కలసి సూపర్ హిట్ చిత్రం రెడీలో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో వీరిద్దరి జోడికి అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ చిత్రంతో రామ్, జెనీలియా మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. అదే సాన్నిహిత్యాన్ని రామ్ జెనీలియా ఫ్యామిలీతో కూడా కొనసాగిస్తున్నాడు.