2019లో ఈ హీరోయిన్ల పంట పండింది.. ఫ్లాపుల్లో ఉన్నవారు కూడా గట్టెక్కారు

First Published 17, Dec 2019, 6:09 PM

2019 ఏడాది కొందరు హీరోయిన్లకు మంచి ఫలితాలని ఇస్తే.. మరికొందరికి నిరాశపరిచింది. పూజా హెగ్డే, తమన్నా, సమంత లాంటి హీరోయిన్లు తమ జోరుని కొనసాగించగా.. రెజీనా, నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్లు ఫెయిల్యూర్స్ నుంచి బయటపడ్డారు.  2019లో మంచి ఫలితాలు అందుకున్న హీరోయిన్ల వివరాలు ఇలా ఉన్నాయి. 

సమంత : ఈ ఏడాది హీరోయిన్ల విషయానికి వస్తే ముందుగా సమంత పేరే చెప్పుకోవాలి. సమంత పట్టిందల్లా బంగారం అవుతోంది. ఈ ఏడాది సమంత నటించిన మజిలీ, ఓ బేబీ రెండు చిత్రాలు ఘనవిజయం సాధించాయి.

పూజ హెగ్డే : ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరు. పూజా హెగ్డే ఈ ఏడాది మహేష్ బాబు మహర్షి చిత్రంలో, వరుణ్ తేజ్ సరసన గద్దలకొండ గణేష్ చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ కావడంతో పూజా క్రేజ్ మరింతగా పెరిగింది.

నివేత పేతురాజ్ : నివేత పేతురాజ్ కు ఈ ఏడాది టాలీవుడ్ లో బాగానే కలసి వచ్చింది. నివేత నటించిన చిత్రలహరి, బ్రోచేవారెవరురా చిత్రాలు మంచి విజయం సాధించాయి.

రెజీనా : వరుస ప్లాపులతో సతమతమవుతున్న రెజీనాకు 2019 మంచి ఊరట నిచ్చింది. ఈ ఏడాది రెజీనా నటించిన 'ఎవరు' చిత్రం థ్రిల్లింగ్ హిట్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో రెజీనా పాత్రకు ప్రశంసలు దక్కాయి.

కళ్యాణి ప్రియదర్శన్: మలయాళీ భామ కళ్యాణి ప్రియదర్శన్ కు ఈ ఏడాది టాలీవుడ్ లో తొలి హిట్ అందుకుంది. చిత్రలహరి చిత్రంలో తేజు సరసన కళ్యాణి నటించిన సంగతి తెలిసిందే.

శ్రద్దా శ్రీనాథ్ : జెర్సీ చిత్రంలో నాని సరసన శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం శ్రద్దా శ్రీనాథ్ కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది.

నయనతార: సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారకు కూడా 2019 మంచి ఫలితాలనే ఇచ్చింది. నయన్ నటించిన బిగిల్, సైరా నరసింహారెడ్డి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.

నిధి అగర్వాల్ : అందం, అభినయం ఉన్నపటికీ నిధి అగర్వాల్ కు సరైన హిట్ లేదు. ఈ ఏడాది నిధి అగర్వాల్ కు ఆ లోటు తీరింది. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో నిధి సూపర్ సక్సెస్ సొంతం చేసుకుంది.

తమన్నా : తమన్నాకు 2019 సంవత్సరం మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చింది. ఏడాది ఆరంభంలో ఎఫ్2 చిత్రంతో తమన్నా సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. సైరా చిత్రంలో తమన్నా పోషించిన పాత్రకు కూడా ప్రశంసలు దక్కాయి.

నభా నటేష్ : కుర్రకారుని మాయ చేస్తున్న నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో హిట్ సొంతం చేసుకుంది.

నివేత థామస్ : విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతున్న నివేత థామస్ ఈ ఏడాది 118, బ్రోచేవారెవరురా లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది.

loader