పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం పింక్ రీమేక్ రోజు రోజుకు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పవన్ కళ్యాణ్ తొలిసారి విభిన్నమైన చిత్రంలో నటిస్తున్నాడు. హిందీలో ఘనవిజయం సాధించిన పింక్ చిత్రాన్ని ఇప్పటికే తమిళంలో రీమేక్ చేశారు. ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాయర్ గా నటించడం ఇదే తొలిసారి. 

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ త్వరగా ఫినిష్ చేసి సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి లాయర్ సాబ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఛలో డైరెక్టర్ నమ్మక ద్రోహం.. వాడు వస్తానన్నా నేను రానివ్వను: నాగశౌర్య! 

ఈ చిత్రానికి లాయర్ సాబ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. ఇంతవరకు పవన్ మూవీ కోసం ఎలాంటి టైటిల్ అనుకోలేదు. ఉగాదికి టైటిల్ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు దిల్ రాజు తెలిపారు.లాయర్ సాబ్ అనే టైటిల్ ఇప్పటికే అభిమానుల్లోకి బాగా వెళ్ళింది. ఈ టైటిల్ సౌండింగ్ కూడా బావుందని ఫ్యాన్స్ అంటున్నారు. అలాంటి తరుణంలో దిల్ రాజు టైటిల్ ఇది కాదని ప్రకటించడం కాస్త షాక్ ఇచ్చే అంశమే. తొలి ప్రేమ చిత్రంతో డిస్ట్రిబ్యూటర్ గా మారిన దిల్ రాజు.. అప్పటి నుంచి పవన్ తో ఓ సినిమా నిర్మించాలని ప్రయత్నిస్తున్నారు.

వడ్డే నవీన్ కుమారుడి పంచె కట్టు వేడుకలో చిరంజీవి.. సెలెబ్రిటీల సందడి(ఫొటోస్)

ఎట్టకేలకు తన కోరిక పింక్ రీమేక్ ద్వారా నెరవేరబోతోందని దిల్ రాజు అన్నారు. పింక్ రీమేక్ తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్, హరీష్ శంకర్ దర్శత్వంలో నటించబోతున్నాడు. 

RRRని నిలదీసిన బాహుబలి.. ఎట్టకేలకు ఫస్ట్ లుక్ పై రెస్పాన్స్!