దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న ఈ చిత్రం 400 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోంది. 1920 కాలం నేపథ్యంలో స్వాతంత్ర ఉద్యమ కథగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరక్కిస్తున్నాడు. 

ఈ చిత్రం ప్రారంభమై ఏడాది గడిచిపోయినా నటీ నటుల వివరాలు తప్ప రాజమౌళి ఎలాంటి అప్డేట్ అందించలేదు. దీనితో అభిమానులకు ఎదురుచూపులు తప్పడం లేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్నారు. 

తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ ట్విట్టర్ హ్యాండిల్, బాహుబలి ట్విట్టర్ హ్యాండిల్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. బాహుబలి టీం ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ ని నిరీక్షణని తెలియజేస్తూ రాజమౌళిని నిలదీశారు. 

ఛలో డైరెక్టర్ నమ్మక ద్రోహం.. వాడు వస్తానన్నా నేను రానివ్వను: నాగశౌర్య!

'ఆర్ఆర్ఆర్.. దీనిని ఒకసారి గమనించు.. మాహిష్మతి సామ్రాజ్య వాసులంతా ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ మీరు మాత్రం పండగలకి శుభాకాంక్షలు చెప్పడం తప్ప అభిమానులని పట్టించుకోవడం లేదు' అని బాహుబలి ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొందరు అభిమానుల ట్వీట్స్ ని కూడా పోస్ట్ చేసింది. 

గ్రాండ్ పార్టీ.. క్రేజీ డైరెక్టర్స్ తో అల్లు అర్జున్ మెమొరబుల్ పిక్

దీనికి ఆర్ఆర్ఆర్ ట్విట్టర్ హ్యాండిల్ సమాధానం ఇచ్చింది. 'మీ అడుగు జాడల్లోనే మేము కూడా నడుస్తున్నాం. బాహుబలి ఫస్ట్ లుక్, ట్రైలర్స్ కోసం అభిమానులని మీరు ఎంతగా వేచి ఉండేలా చేశారో మేము ఇంకా మరచిపోలేదు. మా అభిమానులు మమ్మల్ని ప్రేమిస్తారు.. మేము వారిని ప్రేమిస్తాం. వారి అంచనాలని అందుకుంటాం అని వారికి తెలుసు. కాబట్టి ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తూ ఉండండి. త్వరలో వస్తున్నాం' అంటూ ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పై స్పందించింది.