గత ఏడాది హీరోయిన్ తనుశ్రీ దత్తా దేశం మొత్తం ప్రకంపనలు సృష్టించింది. తనుశ్రీ దత్తా మీటూ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత కొన్ని నెలల పాటు ఇండియాలో ఇదే హాట్ టాపిక్ గా నిలిచింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు నానా పాటేకర్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడని ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఫలితంగా నానా పాటేకర్ కొన్ని సినిమాలు కోల్పోవలసి వచ్చింది. 

తనుశ్రీ దత్తా చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి బహిరంగంగా ప్రస్తావించింది. ఆమెని చూసి మిగిలిన హీరోయిన్లుగా స్ఫూర్తిని పొందారు. దీనితో బాలీవుడ్ లో చాలా మంది దర్శకులు, నిర్మాతలు, నటుల జాతకాలు బయపటపడ్డాయి. 

తనపై ఆరోపణలు చేయడంతో నానాపాటేకర్ తనుశ్రీపై పరువునష్టం దావా వేశారు. ఈ కేసుని వాదించడానికి తనుశ్రీ దత్తా నితిన్ సత్పుటే అనే లాయర్ ని నియమించుకుంది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో సాగుతుండగా నితిన్ సత్పుటే గురించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అతడు కూడా కామాంధుడే అంటూ ఓ మహిళా లాయర్ కేసు నమోదు చేసింది. 

త్రివిక్రమ్ క్రేజ్ చూశారా.. అల్లు అర్జున్ తో సమానంగా..

నితిన్ సత్పుటే ఆడవారితో అసభ్యంగా ప్రవర్తిస్తాడని.. కొందరు మహిళలని లోబరుచుకునేందుకు ప్రయత్నిస్తాడని ఆరోపించింది. తనకు కూడా అలాంటి చేదు అనుభవం ఎదురైనట్లు సదరు మహిళా లాయర్ పేర్కొంది. ఓ గార్డెన్ ఏరియాని చిన్న పిల్లల క్రీడా స్థలంగా మార్చే వివాదంలో తామిద్దరం కోర్టులో ప్రత్యర్థులుగా ఉన్నట్లు ఆమె తెలిపింది. 

రెచ్చిపోయిన 49ఏళ్ల యాంకర్.. టాప్ లెస్ ఫోజులతో ఏందీ రచ్చ!

ఈ కేసుని కాంప్రమైజ్ చేసేందుకు తనవద్దకు వచ్చి అతడు అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె కేసు నమోదు చేసింది. నానా పాటేకర్ కేసు నుంచి తనని రక్షిస్తాడని తనుశ్రీ ఆ లాయర్ ని నియమించుకుంది. ఇప్పుడు అతడు కూడా అసభ్య ప్రవర్తన కలిగిన వాడే అని తేలిపోయింది. దీనిపై తనుశ్రీ ఎలా స్పందిస్తుందో చూడాలి. జరుగుతున్న అన్ని పరిణామాలు గమనిస్తుంటే తనుశ్రీకి బ్యాడ్ టైం నడుస్తున్నట్లు అనిపిస్తోంది. తనుశ్రీ దత్తా నటించిన ఏకైక తెలుగు మూవీ వీరభద్ర. ఈ చిత్రంలో తనుశ్రీ బాలయ్యతో రొమాన్స్ చేసింది. 

మోహన్ బాబు, చిరంజీవి ఎఫెక్ట్.. మంచు మనోజ్, రామ్ చరణ్ ని చూశారా!