సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రపంచ వ్యాప్తంగా శనివారం రిలీజ్ కు రెడీ అయింది. మరో కొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎస్ లో ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే థియేటర్స్ వద్ద మహేష్ అభిమానుల కోలాహలం మొదలైంది. 

ఇదిలా ఉండగా ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ శివ సత్యం సరిలేరు నీకెవ్వరు చిత్రం గురించి సోషల్ మీడియాలో తన రివ్యూ తెలియజేశారు. ఆయన ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించారా అనేది తెలియాల్సి ఉంది. కానీ  ఆయన చెప్పిన రివ్యూతో మహేష్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు. 

అతడితోనే నా పెళ్లి.. ఆ టైంలోనే ఫిక్స్ అయ్యా.. బిగ్ బాస్ భానుశ్రీ కామెంట్స్

శివ సత్యం ట్విట్టర్ లో.. సరిలేరు నీ కెవ్వరు చిత్రం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 'మార్వలస్'. ఇది కంప్లీట్ ఎంటర్టైనింగ్ ప్యాకేజ్ చిత్రం. ఇటీవల కాలంలో  మహేష్ నటించిన బెస్ట్ మూవీ ఇదే. ఈ చిత్రంలో ప్రతి అంశం బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపిస్తుంది' అని ట్వీట్ చేశారు.

'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్ రివ్యూ ఏపీ నుంచే.. గ్రాండ్ గా ప్లాన్స్! 

మహేష్ పెర్ఫామెన్స్, విజువల్స్, రష్మిక మందన నటన, ఎడిటింగ్, బ్యాగ్రౌండ్ సంగీతం, కథ, స్క్రీన్ ప్లే ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయని శివ సత్యం అన్నారు. ఈ చిత్రానికి తాను 3.5 రేటింగ్ ఇస్తున్నట్లు కూడా తెలిపారు. దీనితో సరిలేరు నీకెవ్వరు చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలైపోయింది ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 

1 నేనొక్కడినే ఎఫెక్ట్.. ప్రయోగాలకు రాం రాం.. మహేష్ కామెంట్స్

శుక్రవారం రాత్రి ప్రారంభం కాబోతున్న ప్రీమియర్ షోలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి. మహేష్ బాబు ఈ చిత్రంలో ఆర్మీ మేజర్ గా నటిస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రొఫెసర్ భారతి పాత్రలో నటిస్తోంది.