తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో నటి భానుశ్రీ కంటెస్టెంట్ గా పాల్గొంది. బిగ్ బాస్ 2తో భానుశ్రీ క్రేజ్ పెరిగింది. అప్పటి వరకు చిన్న పాత్రలకు పరిమితమైన భానుశ్రీ బిగ్ బాస్ తర్వాత టాలీవుడ్ దృష్టిలో పడింది. బిగ్ బాస్ లో జరిగిన కొన్ని వివాదాలు కూడా ఆమెకు పబ్లిసిటీ తెచ్చి పెట్టాయి. 

ప్రస్తుతం భానుశ్రీ కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ఆ మధ్యన హిట్ టాపిక్ గా మారిన అడల్ట్ మూవీ ఏడు చేపల కథ చిత్రంలో కూడా భానుశ్రీ నటించింది. తాజాగా భానుశ్రీ ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ అయింది. పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. నా జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు శివశంకర్ రెడ్డి. 

నాకు జీవితంలో ఎవరూ లేని సమయంలో.. ఒంటరిగా ఫైట్ చేస్తున్న తరుణంలో ఆయన అండగా నిలిచారు. ప్రతి విషయంలో నన్ను ప్రోత్సహించారు. ఆయననే నాకు కాబోయే భర్త. ఇందులో దాచడానికి ఏమీ లేదు అని భానుశ్రీ తెలిపింది. ఇండస్ట్రీలో అనేక ప్రేమ వ్యవహారాల గురించి వింటుంటాం. నా జీవితంలో అలాంటి సంఘటనలు లేవు. ఎందుకంటే నా భర్త అతడే అని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినట్లు భానుశ్రీ తెలిపింది. 

'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్ రివ్యూ ఏపీ నుంచే.. గ్రాండ్ గా ప్లాన్స్!

ప్రస్తుతం సినిమాల్లో బిజీగానే ఉన్నట్లు తెలిపింది. ఈ ఏడాదిలోనే తామిద్దరం వివాహం చేసుకోబోతున్నట్లు భానుశ్రీ తెలిపింది. గ్రాండ్ గా వివాహం చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే సింపుల్ గా గుడిలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం అని భానుశ్రీ తెలిపింది. 

దిశా సంఘటనపై త్రివిక్రమ్ రెస్పాన్స్.. 'అల వైకుంఠపురములో' ఆ సీన్!

బిగ్ బాస్ 2లో భానుశ్రీ చురుకుగా పాల్గొంది. కానీ కొన్ని టాస్క్ లలో భానుశ్రీ వాళ్లు వివాదాలు కూడా చెలరేగాయి.