సరిలేరు నీకెవ్వరు మూవీ గ్రాండ్ రిలీజ్ కు అంతా సిద్ధం అయిపోయింది. శుక్రవారం రాత్రి నుంచే ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రీమియర్ షోలకు అనుమతి నిచ్చింది. దీనితో తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు నీకెవ్వరు చిత్రానికి రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ నమోదు కాబోతున్నట్లు ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. 

తెలుగు స్టార్ హీరోల చిత్రాలకు మొట్టమొదటి రెస్పాన్స్ యుఎస్ నుంచి వస్తుంది. ఇండియాలో కంటే ముందుగా యుఎస్ లో ప్రీమియర్ షోలు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో మొదటి షో పడేసరికే యుఎస్ నుంచి అభిమానుల రెస్పాన్స్, రివ్యూలు వచ్చేస్తాయి. 

చాలా రోజుల తర్వాత ఆ పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తోంది. సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని మొట్టమొదటి రెస్పాన్స్ యుఎస్ నుంచి కాకుండా ఆంధ్ర ప్రదేశ్ నుంచి రానుంది. ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో అర్థరాత్రి 12 గంటలకు స్పెషల్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. అంటే యుఎస్ లో ప్రీమియర్స్ కంటే ముందుగానే ఏపీలో స్పెషల్ షోలు పూర్తయిపోతాయి. 

లోకల్ గా స్పెషల్ షోలు ముందుగా ప్రారంభం కానుండడంతో అభిమానుల రచ్చ ఏస్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. సినిమా టాక్, రివ్యూలు వేగంగా స్ప్రెడ్ అయిపోతాయి. స్పెషల్ షోలకు మహేష్ ఫ్యాన్స్ ఇప్పటికే గ్రాండ్ గా ప్లాన్స్ చేసుకుంటున్నారు. 

దిశా సంఘటనపై త్రివిక్రమ్ రెస్పాన్స్.. 'అల వైకుంఠపురములో' ఆ సీన్!

దూకుడు తర్వాత మహేష్ బాబు నుంచి పూర్తి స్థాయిలో వస్తున్న మాస్ ఎంటర్ టైనర్ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. చిత్ర యూనిట్ కూడా ఈ చిత్రంపై కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ చిత్రంలో మహేష్ కు జోడిగా రష్మిక మందన నటిస్తోంది. 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతి పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్నారు. అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. 

1 నేనొక్కడినే ఎఫెక్ట్.. ప్రయోగాలకు రాం రాం.. మహేష్ కామెంట్స్