సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంక్రాంతి కానుకగా సూపర్ బజ్ తో ఈ చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం రాత్రే యూఎస్ లో ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. దీనితో మహేష్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. 

అనిల్ రావిపూడి దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటిస్తున్నాడు. 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతి పాత్ర కూడా ఈ చిత్రంలో పవర్ ఫుల్ గా ఉండబోతోంది. ట్రైలర్ లో మహేష్ యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకర్షిస్తోంది. 

మహేష్ బాబు చాలా కాలంగా ఒకే రకమైన లుక్ లో, ఒకే తరహా చిత్రాలు చేస్తున్నాడనే విమర్శ ఉంది. సినిమాల్లో మహేష్ చేసే ప్రయోగాలు చాలా తక్కువ అని అంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహెష్ ప్రయోగాత్మక చిత్రాల్లో నటించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ప్రయోగాత్మక చిత్రాలు అనుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ కాదు. టాలీవుడ్ లో పెద్ద హీరోలమంతా ఒక విచిత్రమైన జోన్ లో ఉన్నాం. ఆ జోన్ నుంచి బయటకు వచ్చి సినిమా చేయాలంటే ఎంతో ఆలోచించాల్సి ఉంటుంది. నిర్మాత 100 కోట్లు పెట్టి సినిమా తీస్తారు. బయ్యర్లు మమ్మల్ని నమ్మి సినిమా కొంటారు. 

దిశా సంఘటనపై త్రివిక్రమ్ రెస్పాన్స్.. 'అల వైకుంఠపురములో' ఆ సీన్!

అలాంటప్పుడు ప్రయోగాల పేరుతో సినిమాలు చేస్తే నష్టం వస్తుంది. ఒక వేళ ప్రయోగాత్మక చిత్రాలు చేయాలనుకుంటే అన్ని అంశాలు కుదిరాక తక్కువ బడ్జెట్ లో తీయొచ్చు అని మహేష్ తెలిపాడు. వంశీ పైడిపల్లి దర్శత్వంలో తెరకెక్కబోయే తన తదుపరి చిత్రం కూడా పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రంగానే ఉండబోతోందని మహేష్ తెలిపాడు. సరిలేరు నీకెవ్వరు రిలీజ్ అయ్యాక రెండు నెలలపాటు విరామం తీసుకోనున్నట్లు మహేష్ చెప్పుకొచ్చాడు. 

ఇటీవల కాలంలో మహేష్ నుంచి వచ్చిన వైవిధ్యభరితమైన చిత్రం 1 నేనొక్కడినే. ఈ చిత్రంలో మహేష్ పెర్ఫామెన్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ సినిమా మాత్రం కమర్షియల్ గా రాణించలేకపోయింది. ఈ మూవీ తర్వాత మహేష్ ప్రయోగాత్మక చిత్రాల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు ఉన్నాడు.