స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకుంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 140 కోట్లకు పైగా షేర్ కొల్లగొట్టింది. 

సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తో చిత్ర యూనిట్ కూడా ప్రచార కార్యక్రమాల్ని జోరుగా నిర్వహించింది. ఈ చిత్ర విజయానికి కారణమైన అభిమానులతో, డిస్ట్రిబ్యూటర్స్, జర్నలిస్టులతో బన్నీ సక్సెస్ షేర్ చేసుకున్నాడు. తాజాగా అల్లు అర్జున్ తాను చేసిన  ఓ గొప్ప పనితో ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. 

బ్రేకింగ్: అఫీషియల్ గా RRR వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!

సినిమా జర్నలిస్టులు అల వైకుంఠపురములో చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎంతో కృషి చేశారని పలు సందర్భాల్లో అల్లు అర్జున్ తెలిపాడు. వారిని గౌరవించుకోవాలనే ఆలోచన అల్లు అర్జున్ కు వచ్చింది. ఆ ఆలోచన వచ్చిన వెంటనే బన్నీ సినిమా జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ 10 లక్షలు విరాళంగా ప్రకటించాడు. 

వితికని పక్కనే పెట్టుకుని.. ఇలియానాపై వరుణ్ హాట్ కామెంట్స్!

రూ10 లక్షల చెక్కుని సినిమా జర్నలిస్టుల అసోసియేషన్ కు అందించాడు. దీనితో అల్లు అర్జున్ పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. అల్లు అర్జున్ తదుపరి చిత్రం స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. సుకుమార్ ఈ చిత్రాన్ని ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో చిత్రీకరిస్తున్నారు. 

బ్లాక్ డ్రెస్ లో 'ఎఫ్ 2' హీరోయిన్ ఫోజులు.. సమ్మోహన పరిచే అందం!