హ్యాపీ డేస్ చిత్రంతో హీరోగా పరిచయమిన వరుణ్ సందేశ్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ కు సరైన సక్సెస్ లేకపోవడంతో అవకాశాలు లేవు. అయినప్పటికీ వరుణ్ సందేశ్ కు ఒక ఇమేజ్ ఉంది. గత ఏడాది ముగిసిన బిగ్ బాస్ సీజన్ 3 లో వరుణ్ సందేశ్, వితిక దంపతులు జంటగా పాల్గొన్నారు. 

వరుణ్ సందేశ్ టాప్ 5లోకి చేరుకోగా.. వితిక దాదాపు 3 నెలల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఇతర కంటెస్టెంట్స్ కు పోటీనిచ్చింది. బిగ్ బాస్ పూర్తయ్యాక ఈ జంట సోషల్ మీడియాలో బాగా హంగామా చేస్తున్నారు. తాజాగా వితిక, వరుణ్ సందేశ్ కమెడియన్ అలీ హోస్ట్ గా నిర్వహించే ఓ టీవీ కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు. 

ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. కంప్లీట్ షో ఈ నెల 10న ప్రసారం కానుంది. ప్రోమో గమనిస్తే వరుణ్, వితికలకు అలీ నుంచి సరదా ప్రశ్నలు ఎదురయ్యాయి. వితిక ఎప్పుడూ తనకు భయపడదని.. తాను మాత్రం వితిక అంటే కొంచెం భయపడతానని వరుణ్ తెలిపాడు. దీనితో.. బిగ్ బాస్ పూర్తయిపోయింది ఇక బయటకు రా నాన్నా అంటూ వితిక వరుణ్ పై ఫన్నీ జోక్స్ వేసింది. 

టాప్ లెస్ గా టైట్ హగ్.. రాయ్ లక్ష్మీ బోల్డ్ రొమాన్స్ వైరల్

ఇక తమ మ్యారేజ్ విషయాన్ని కూడా వితిక ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించినట్లు ఉంది. తామిద్దరం రిలేషన్ అనే డిస్కషన్స్ లో ఉండగానే ఇరు కుటుంబాలు సంబంధం ఫిక్స్ చేసేశారు అని వితిక ప్రోమోలో తెలిపింది. ఇక అలీ అడిగిన ఓ ప్రశ్నకు వరుణ్ ఇచ్చిన సమాధానం నవ్వులు పూయిస్తోంది. 

పవన్ హీరోయిన్ కి ఆఫర్స్ లేవు.. అయినా లగ్జరీ కారు కొనేసింది చూశారా!

ఇక వేళ వితికని పెళ్లి చేసుకోకపోయి ఉంటే.. ఏ హీరోయిన్ ని పెళ్లి చేసుకునేవాడివి అని అలీ ప్రశ్నించారు. దీనికి వరుణ్ తనకు ఇలియానా అంటే చాలా ఇష్టమని బదులిచ్చాడు. దీనితో వితికతో పాటు అలీ కూడా నవ్వుల్లో మునిగిపోయారు. బిగ్ బాస్ హౌస్ లో ఇష్టమైన వ్యక్తి ఎవరు అని అలీ వితికని ప్రశ్నించాడు. దీనికి వితిక ఏమాత్రం తడుముకోకుండా పునర్నవి అని సమాధానం ఇచ్చింది. పూర్తి షో ప్రసారం అయ్యాక వితిక, వరుణ్ అలీతో పంచుకున్న ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. 

స్విమ్మింగ్ పూల్ లో వితిక, వరుణ్ రొమాంటిక్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫొటోస్